AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి భారీ ఊరట.. కేంద్రం అత్యవసర ఆదేశాలు.. తక్షణం అమల్లోకి..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. కమర్షియల్, కంపెనీలకు సరఫరా చేసే గ్యాస్‌పై పరిమితులు విధించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాలు ఏంటో చూద్దాం.

Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి భారీ ఊరట.. కేంద్రం అత్యవసర ఆదేశాలు.. తక్షణం అమల్లోకి..
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Mar 06, 2026 | 12:40 PM

Share

ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వినియోగదారులకు అంతరాయం లేకుండా సిలిండర్లను సరఫరా చేసేందుకు గ్యాస్ సరఫరా కంపెనీలకు కీలక ఆదేశాలు శుక్రవారం జారీ చేసింది. అవేంటంటే.. గ్యాస్ కంపెనీలకు పలు పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్యాస్ కంపెనీలు గృహ వినియోగదారులకు సిలిండర్లను పంపిణీ చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కమర్షియల్, ఇండస్ట్రీయల్, పెట్రో కెమికల్ అవసరాల కోసం గ్యాస్ సరఫరాకు సంబంధించి కొన్ని పరిమితులు విధించింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఎఫెక్ట్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల గ్యాస్ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల విదేశాల నుంచి గ్యాస్‌ను ఇండియాకు తరలించేందుకు రవాణాకు ఆటంకం కలుగుతోంది. యుద్దం నిర్విరామంగా కొనసాగుతుండగా.. మరికొన్ని రోజుల పాటు కొనసాగితే గ్యాస్ రవాణా స్తంభించిపోయే ప్రమాదముంది. దీని వల్ల ఎల్పీజీకి కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బంది జగరకుండా గృహ అవసరాలకు సరఫరా చేసే సిలిండర్లు ప్రాధాన్యత ఇవ్వాలని ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. తరుపది ఆదేశాలు వచ్చేంతవరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులు ఆర్డర్ 1999 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రయోజనం, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి

ఇక దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాను పెంచడానికి కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. అన్ని శుద్ది కార్మాగారాలు ప్రొపేన్-బ్యూటేన్ నుంచి గరిష్ట స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులు ప్రొపేన్-బ్యూటేనే వాడకాన్ని నిషేధించింది. ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రమే ఎల్పీజీ అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అటు ముడి చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి.  దీని ప్రభావం గ్యాస్ ధరలపై పడనుంది. ముడి చమురు ధరలతో గ్యాస్ ధరలు ఆధారపడి ఉంటాయి. ఇరాన్ నుంచి ముడి చమురు ఎక్కువగా దిగుమతి అవుతుంది. దీంతో గ్యాస్ ధరలు త్వరలో పెరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే సామన్యులకు భారంగా మారే అవకాశముంది. దీంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపడుతోంది.

Follow Us