AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకంపై నిషేధం.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం!

కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకంపై నిషేధం.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం!
Karnataka Bans Social Media For Children Under 16
Anand T
|

Updated on: Mar 06, 2026 | 12:35 PM

Share

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి వ్యసనంగా మారిపోయింది. ఈ సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలపై చిన్నప్పటి నుంచే ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కఠినమైన డిజిటల్ నియమాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగాలో మొదటగా రాష్ట్రంగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

అసెంబ్లీలో 2026-27 కర్ణాటక వార్షిక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వాడకంతో చిన్నారుల్లో ఎన్నోరకాల మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తుతున్నాయని. వాటని అలానే వదిలేస్తే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉందని అన్నారు. అందుకే పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే చాలా దేశాల్లో మైనర్లు సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించినప్పటికీ మన భారతదేశంలో 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై నిషేదాన్ని విధించిన ఏకైక తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us