AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..? నాజుగ్గా అందంగా ఉండాలంటే..

ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట సాగుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే, నీరు కేవలం కొద్ది నిమిషాల్లోనే శరీరం గ్రహించుకుంటుందని, దాని వల్ల పొట్ట సాగదని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గడంతో పాటు శరీరం డీటాక్స్ అవుతుంది. అయితే, అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే పొట్ట పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..? నాజుగ్గా అందంగా ఉండాలంటే..
Morning Water Myth
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2026 | 8:57 AM

Share

శరీర ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఉదయం లేవగానే కడుపు నిండా నీరు తాగే అలవాటుపై కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా “ఉదయాన్నే ఎక్కువ నీరు తాగితే పొట్ట సాగుతుంది” అనే వాదన అనేకమందిని ఈ ఆరోగ్యకరమైన అలవాటు నుండి దూరం చేస్తోంది. అయితే.. నీరు తాగడం వల్ల పొట్ట సాగదనీ, దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నీరు తాగిన తర్వాత కేవలం 10-15 నిమిషాల్లోనే పొట్టలో నుంచి రక్తంలోకి లేదా ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. గరిష్టంగా అరగంట కంటే ఎక్కువ సమయం నీరు పొట్టలో ఉండదు. నీటికి జీర్ణక్రియ అవసరం లేదు కాబట్టి, అది వెంటనే శరీరం గ్రహించుకుంటుంది. అందువల్ల, నీరు తాగడం వల్ల పొట్ట సాగే అవకాశం లేదు..

మన ప్రాచీన ఆచారాలు – నీటి ప్రాముఖ్యత

మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఉదయం కడుపునిండా నీరు తాగే ప్రాముఖ్యతను గుర్తించారు. రాగి చెంబులో నీరు పోసి రాత్రంతా ఉంచి, ఉదయం ఆ నీటిని తాగమని చెప్పే ఆచారం మన ఇళ్లలో ఇప్పటికీ ఉంది. పొట్ట నిండా నీరు తాగడం వల్ల మల ప్రేగులపై ఒత్తిడి కలిగి, మల విసర్జన సులభతరం అవుతుందని ఇది ఒక ప్రాథమిక సూత్రం. జపాన్ వంటి దేశాలు కూడా ఒక లీటర్ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదని ప్రచారం చేసినప్పటికీ.. ఇది మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న పద్ధతేనని వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.. అయితే.. ఇక్కడ లీటర్ తాగాలన్నది సూత్రం కాదు.. కానీ.. ఉదయాన్నే రెండు గ్లాసుల నీరు తీసుకోవడం లేదా.. శరీర పరిమాణాన్ని బట్టి నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే ఒకేసారి ఎక్కువ నీరు తాగడం కంటే, గోరువెచ్చని నీటిని సిప్ చేస్తూ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి..

పొట్ట సాగడానికి నిజమైన కారణాలు..

ఆహారం: ఆహారం పొట్టలో అరగడానికి 2-4 గంటలు పడుతుంది. ప్రేగుల్లో ఇంకో 2-3 గంటలు ఉంటుంది. ఇలా గంటల తరబడి ఆహారం పొట్టలో ఉండటం వల్ల పొట్ట సాగే అవకాశం ఉంటుంది. మామూలుగా పొట్ట సగటు సామర్థ్యం 1-2 లీటర్లు ఉంటుంది. ఎక్కువగా తినేవారికి ఇది 3 లీటర్ల వరకు కూడా సాగవచ్చు.

అధికంగా తినడం – త్రాగడం: ఎక్కువసార్లు తినడం, అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా మద్యం లేదా ఇతర కార్బోనేటెడ్ పానీయాలను అధికంగా తాగడం వల్ల పొట్ట సాగుతుంది. ఈ పానీయాలు కూడా పొట్టలో ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. వెన్నుపూస వెనుకవైపు ఉండటం వల్ల పొట్ట ముందుకు సాగుతుందని ఆయన వివరించారు.

వ్యాయామం లేకపోవడం: సరిపడా వ్యాయామం లేకపోవడం కూడా పొట్ట పెరగడానికి ఒక ముఖ్య కారణం..

బాడీ టిటాక్స్.. అందం..

ఉదయం పూట నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గి, శరీరం డీటాక్స్ అవుతుంది. పొట్ట సాగుతుందనే భయం లేకుండా నిర్భయంగా నీరు తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బదులుగా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, ఎక్కువసార్లు తినడం, ఎక్కువగా త్రాగడం వంటివి మానుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, నియమిత వ్యాయామం ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు, తద్వారా ఆరోగ్యంగా, అందంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు..

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌