AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల లాభం.. షాప్ అక్కర్లేకుండానే..

Summer Business Idea: సమ్మర్ ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. పెరుగుతున్న ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సామాన్యుడికి ఉన్న ఏకైక ఆశ్రయం ఎయిర్ కూలర్. ప్రస్తుతం ఏసీల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెంటు బిల్లుల భయంతో మెజారిటీ ప్రజలు కూలర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటే.. కేవలం మూడు నెలల్లోనే లక్షలు సంపాదించొచ్చు.

సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల లాభం.. షాప్ అక్కర్లేకుండానే..
air Coolers
Krishna S
|

Updated on: Mar 07, 2026 | 1:09 PM

Share

మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వేడి నుంచి తట్టుకోవడానికి సామాన్యుడికి ఉన్న ఏకైక ఆశ్రయం.. ఎయిర్ కూలర్.. ఏసీల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, కరెంటు బిల్లులు గుండె బాదుతున్నాయి. అందుకే ఇప్పుడు మార్కెట్‌లో కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ఈ ఎండలను కేవలం తిట్టుకుంటూ కూర్చుంటే ఏం వస్తుంది? అదే ఈ ఎండలనే పెట్టుబడిగా మార్చుకుంటే.. కేవలం మూడు నెలల్లోనే మీ చేతికి మూడు లక్షల రూపాయల లాభం వస్తే ఎలా ఉంటుంది? అసలు ఎక్కడ కొంటే కూలర్లు తక్కువ ధరకు వస్తాయి? షోరూమ్ లేకుండానే రోడ్డు పక్కన టెంట్ వేసి లక్షలు సంపాదించడం ఎలా? కేవలం ఒక్క వేసవి సీజన్‌లోనే మీ తలరాతను మార్చే ఆ కూల్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ కొనలేక.. కూలర్ల వైపు మొగ్గు

మధ్యతరగతి కుటుంబాలు, విద్యార్థులు, చిన్న చిన్న దుకాణదారులు ఏసీల కంటే కూలర్లనే ఎక్కువగా ఇష్టపడతారు. బ్రాండెడ్ కూలర్ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు తక్కువ ధరకు లభించే లోకల్ బ్రాండ్ లేదా అసెంబ్లడ్ కూలర్ల కోసం వెతుకుతుంటారు. మార్కెట్‌లో ఉన్న ఈ భారీ డిమాండ్‌ను వినియోగించుకుంటే తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు పొందవచ్చు.

హోల్‌సేల్ మార్కెట్లే కీలకం

ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే నాణ్యమైన కూలర్లను తక్కువ ధరకు సేకరించాలి. హైదరాబాద్‌‌లోని కోఠి, బేగం బజార్ వంటి ప్రాంతాల్లో కూలర్లు హోల్‌సేల్ ధరలకు లభిస్తాయి. నేరుగా కూలర్ తయారీ యూనిట్లను సంప్రదిస్తే ఇంకా తక్కువ ధరకే వస్తువులను పొందవచ్చు. దీనివల్ల మీ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది.

దుకాణం అక్కర్లేదు.. పెట్టుబడి తక్కువ

ఈ వ్యాపారానికి భారీ షోరూమ్‌లు అవసరం లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా మెయిన్ రోడ్డు పక్కన ఒక టెంట్ వేసి కూడా వీటిని విక్రయించవచ్చు. ఒక గిడ్డంగిని కేవలం వేసవి కాలం కోసం మూడు నెలల అద్దెకు తీసుకుని స్టాక్ మెయింటెన్ చేయవచ్చు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.

లాభాల లెక్క: నెలకు రూ. 1 లక్ష ఖాయం

కూలర్ సైజు, మోడల్‌ను బట్టి ఒక్కో కూలర్‌పై కనిష్టంగా రూ.300 నుండి రూ.500 వరకు లాభం ఉంటుంది. పట్టణాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో వ్యాపారం చేస్తే రోజుకు కనీసం 10 కూలర్లు అమ్మడం పెద్ద కష్టమేమీ కాదు. రోజుకు రూ.3,000 నుండి రూ.5,000 లాభం వస్తే.. నెలకు కనీసం రూ.1 లక్ష ఆదాయం మీ సొంతం అవుతుంది. ఇలా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వ్యాపారం సాగితే రూ.3 లక్షల వరకు లాభం గడించే అవకాశం ఉంది.

తక్కువ రిస్క్, ఎక్కువ లాభం ఇచ్చే సీజనల్ వ్యాపారం కోసం చూస్తున్న వారికి కూలర్ల బిజినెస్ ఒక ‘గోల్డెన్ ఛాన్స్’. సరైన ప్లానింగ్‌తో హోల్‌సేల్ మార్కెట్ల నుంచి సరుకు తెచ్చుకుంటే ఈ వేసవిలో మీ జేబులు నిండటం ఖాయం..

Follow Us
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం..!
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం..!
బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా?ఇలా టేస్టీగా రీయూజ్ చేయండి!
బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా?ఇలా టేస్టీగా రీయూజ్ చేయండి!
ఆకట్టుకుంటున్న రంభ ఊర్వశి మేనక ట్రైలర్
ఆకట్టుకుంటున్న రంభ ఊర్వశి మేనక ట్రైలర్
టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. సెంచరీతో ఇచ్చిపడేశాడుగా..
టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. సెంచరీతో ఇచ్చిపడేశాడుగా..
మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తింటున్నారా? ఇది తెలుసుకోండి!
మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తింటున్నారా? ఇది తెలుసుకోండి!
మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?
మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?
క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాలా
క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాలా
ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..
ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం