AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈఫిల్‌ టవర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనాలు! వీడియో

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కళాఖండంగా పేరుగాంచిన ఈఫిల్‌ టవర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.1063 అడుగుల ఎత్తున్న ఈ టవర్‌ రెండో అంస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో టూరిస్టులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడి చేరుకుని..

Viral Video: ఈఫిల్‌ టవర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనాలు! వీడియో
Eiffel Tower Fire Accident
Srilakshmi C
|

Updated on: Dec 25, 2024 | 11:40 AM

Share

పారిస్‌, డిసెంబర్‌ 25: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్‌ టవర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఎందరో టూరిస్టులు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు. జనాల తాకిడి అధికంగా ఉండే ఈఫిల్ టవర్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పర్యాటకులంతా భయాందోళనలకు గురయ్యారు.

హుటాహుటీన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 1200 మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. ఈఫిల్‌ టవర్‌ మొదటి, రెండో అంతస్తుల మధ్యలోని లిఫ్ట్‌ షాఫ్ట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర బృందాలు అక్కడి నుంచి సందర్శకులను ఖాళీ చేయించి మంటలను అదుపుచేశారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎలివేటర్ కేబుల్స్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సెబ్బంది కాసేపటికే మంటలను అదుపులోకి వచ్చినట్లు యూరోన్యూస్ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

అగ్నిప్రమాదం నేపథ్యంలో ఈఫిల్‌ టవర్‌ను తాత్కాలికంగా మూసివేసి మెయింటెనెన్స్‌ పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. కాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా పేరుగాంచిన ఈషిల్‌ టవర్‌ను నిత్యం సగటున 15 వేల నుంచి 25 వరకు టూరిస్టులు సందర్శిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..