AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు.. ఇదిగో వీడియో..!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. సునీతా విలియమ్స్‌తోపాటు అంతరిక్షంలో నివసిస్తున్న ముగ్గురు వ్యోమగాములు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నాసా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. గత జూన్లో ISSకు వెళ్ళినా సునీతా.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తిరిగి భూమి మీదికి రానుంది.

Watch Video:  అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు.. ఇదిగో వీడియో..!
Nasa Astronauts Sunita Williams Christamas Celebrations
Balaraju Goud
|

Updated on: Dec 25, 2024 | 12:33 PM

Share

NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ చాలా నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు. ఆమె ఈ సంవత్సరం క్రిస్మస్‌ను అక్కడే జరుపుకుంటున్నారు. సునీతా విలియమ్స్‌తోపాటు అంతరిక్షంలో నివసిస్తున్న ముగ్గురు వ్యోమగాములు – డాన్ పెటిట్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేసింది నాసా. ఈ వ్యోమగాముల బృందం అంతరిక్షం నుండి క్రిస్మస్ ఆనందాన్ని పంచుతోంది. అలాగే అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక సన్నాహాలు చేసింది నాసా.

వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యామగాముల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నామని ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వారి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా సునీతా విలియమ్స్, మిగతా వారు స్పేస్‌లో క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్న వీడియోను తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది నాసా. ఇందులో సునీతా మాట్లాడారు.తామందరం బాగానే ఉన్నామని.. క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని, భూమి మీద ఉన్నవారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..