Vizag Steel Plant Jobs: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక! ఎవరు అర్హులంటే..

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాట్ ఉద్యోగ నియామకాలకు నోఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలను చేపట్టనుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతీ నెల స్టైఫెండ్ కూడా అందిస్తారు..

Vizag Steel Plant Jobs: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక! ఎవరు అర్హులంటే..
Vizag Steel Plant
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2024 | 6:32 AM

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్​లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం​స్టీల్​ప్లాంట్.. 2024 డిసెంబర్‌ బ్యాచ్‌కు సంబంధించి దాదాపు 250 అప్రెంటీస్​పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్​విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 9, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ ట్రైనీ (GAT) పోస్టులు 200, టెక్నీషియన్​అప్రెంటీస్​ ట్రైనీ (TAT) పోస్టులు 50 వరకు ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ ట్రైనీ ఖాళీలు.. మెకానికల్​, ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రికల్​అండ్‌ ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​అండ్‌ కమ్యునికేషన్​, కంప్యూటర్​ సైన్స్​/ ఐటీ, మెటలర్జీ, ఇన్​స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్​విభాగాల్లో ఉన్నాయి. టెక్నీషియన్​ అప్రెంటీస్​ఖాళీలు.. మెకానికల్​, ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రికల్​అండ్‌ ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​అండ్‌ కమ్యునికేషన్​, సివిల్​, మైనింగ్, కంప్యూటర్​ సైన్స్​/ మెటలర్జీ, కెమికల్​విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 2022, 2023, 2024 సంవత్సరాల్లో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్​కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఎంహెచ్‌ఆర్‌డీ ఎన్‌ఏటీఎస్‌ 2.0 పోర్టల్‌లో కచ్చితంగా రిజిస్టర్​చేసుకుని ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖపట్నం స్టీల్​ప్లాంట్ అప్రెంటీస్​పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు. మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఇంజినీరింగ్​గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8000 చొప్పున స్టైపెండ్​చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.