AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బాక్సింగ్ డే టెస్ట్‌లో కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్.. అదేంటంటే?

Virat Kohli, Sam Kontas Fight: బాక్సింగ్ డే టెస్ట్ మొదలైన కొద్దిసేపటికే.. ఇరుజట్ల మధ్య కూడా యుద్ద వాతావరణం నెలకొంది. అరంగేంట్రం చేసిన ఆసీస్ యంగ్ ప్లేయర్‌ను టార్గెట్ చేసిన భారత ఆటగాళ్లు కవ్వింపులకు దిగారు. ఈ క్రమంలో కోహ్లీ, సామ్ కొంటాస్ మధ్య వాడీ, వేడీ మాటలు మొదలయ్యాయి. సిరాజ్ కూడా రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Video: బాక్సింగ్ డే టెస్ట్‌లో కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్.. అదేంటంటే?
Virat Kohli Vs Sam Kontas
Venkata Chari
|

Updated on: Dec 26, 2024 | 6:40 AM

Share

Virat Kohli, Sam Kontas Fight: బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ సామ్ కొంటాస్ తొలిరోజు ఆటలోనే వాగ్వివాదానికి దిగడంతో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 4వ టెస్ట్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. విరాట్ కోహ్లి కీపర్ వైపు వెళ్తూ కొంటాస్ భుజాన్ని గట్టిగా ఢీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియన్ యంగ్ ప్లేయర్‌ సీరియస్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాడీవేడీ మాటలతో మెల్‌బోర్న్ హీటెక్కింది. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు.

షీల్డ్ క్రికెట్‌లో పరుగుల వర్షం తర్వాత కొంటాస్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి చేర్చారు. అతను అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తొలి టెస్ట్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఓవైపు భారత ఆటగాళ్లు కోహ్లీ, సిరాజ్ ఇద్దరూ కవ్వింపులు చేస్తున్నా.. ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. మొదటి మూడు టెస్టుల్లో విఫలమైన నాథన్ మెక్‌స్వీనీని ఈ యంగ్ ప్లేయర్ భర్తీ చేశాడు. అరంగేట్రంలోనే 52 బంతుల్లో హాఫ్ సెంచరీతో తన మైండ్ సెట్ ఏంటో చూపించాడు. తద్వారా 19 ఏళ్ల 85 రోజుల్లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రంలోనే ఫిఫ్టీ కొట్టిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

యువ బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రాపై ఒక ఓవర్‌లో 18 పరుగులు రాబట్టి, కొంటాస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బుమ్రా 21 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ యువ బౌలర్ ముందు బుమ్రా తేలిపోయాడు.

కోహ్లీ, కొంటాస్ మధ్య వాగ్వాదం..

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..