Srisailam Temple Reels: శ్రీశైలంలో ఓ యువతి చేసిన రీల్స్ వీడియోలు వివాదాస్పదమయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ప్రశ్నించారు. రీల్స్ చేసిన యువతి ఆలయం వెలుపల, సంప్రదాయ దుస్తుల్లోనే చేశానని, క్షమాపణ చెప్పింది. ఈ సంఘటన దేవాలయాల్లో సోషల్ మీడియా వినియోగంపై చర్చకు దారితీసింది.