AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: గబ్బా టెస్ట్ నుంచి షాకింగ్ న్యూస్.. గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్..

Josh Hazlewood Injured: గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు ఆస్ట్రేలియాకు చెందిన ఓ డేంజరస్ బౌలర్ గాయపడి మైదానాన్ని వీడాడు. అనంతరం స్కానింగ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చాకే ఆ గాయం తీవ్రత తెలియనుంది.

IND vs AUS: గబ్బా టెస్ట్ నుంచి షాకింగ్ న్యూస్.. గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్..
Josh Hazlewood Injured
Venkata Chari
|

Updated on: Dec 17, 2024 | 10:09 AM

Share

Josh Hazlewood Injured: గబ్బా టెస్టులో టీమిండియాపై ఫాలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైన నేపథ్యంలో టీమిండియా కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించాలని ఆలోచించడం కంటే, ప్రస్తుతానికి ఫాలో ఆన్‌ను కాపాడుకోవాలని భారత ఆలోచించాల్సి వస్తోంది. గబ్బా టెస్టులో టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద టెన్షన్. అయితే, ఈలోగా టీమ్ ఇండియాకు కూడా బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఒక ప్రాణాంతక బౌలర్ గాయపడ్డాడు. దీని కారణంగా టీమిండియా పని సులువుగా మారవచ్చు అని తెలుస్తోంది.

గాయపడి మైదానాన్ని వీడిన జోష్ హేజిల్‌వుడ్..

జోష్ హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌లో ముఖ్యమైన భాగం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ నాలుగో రోజు ఆటలో జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్ సమయంలో, అతను నాలుగో రోజు మొదటి సెషన్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. అతనికి కండరాల సమస్య ఉంది. దీంతో హేజిల్‌వుడ్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

జోష్ హేజిల్‌వుడ్ గాయపడిన తర్వాత, అతన్ని స్కాన్ కోసం ఆసుపత్రికి తరలించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా జోష్ హేజిల్‌వుడ్ గాయం గురించి అప్‌డేట్ ఇచ్చింది. ‘హేజిల్‌వుడ్ షిన్ సమస్యతో బాధపడుతున్నాడని ఆస్ట్రేలియన్ జట్టు ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫాస్ట్ బౌలర్ గాయం తీవ్రతను గుర్తించడానికి మెడికల్ స్కాన్ చేయించాల్సి ఉంది. ఆ తర్వాత గాయం తీవ్రత తెలియనుంది అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అడిలైడ్ టెస్టుకు దూరమైన హేజిల్‌వుడ్..

పెర్త్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతను గాయం కారణంగా అడిలైడ్ టెస్టులో పాల్గొనలేకపోయాడు. అతని స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో స్కాట్ బౌలాండ్ చేరాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత గబ్బా టెస్ట్‌లో మరోసారి జోష్ తిరిగి వచ్చాడు. అయితే అతని గాయం కంగారూ జట్టుకు మరోసారి ఆందోళన కలిగించే అంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..