Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: మీరు ఇలా చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ రద్దు అవుతుంది!

గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. దీని ప్రకారం జులై 27లోగా వంటగ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ సహా కేవైసీ వివరాలను నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చని ప్రకటించారు. దీనికి సంబంధించి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు ఎస్ఎంఎస్ పంపింది. భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న..

Gas Cylinder: మీరు ఇలా చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ రద్దు అవుతుంది!
మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నిండుది వాడుతున్నప్పుడు మంట రంగు నీలం రంగులో కనిపిస్తుంది. అలాగే, సిలిండర్ ఖాళీగా ఉన్నప్పుడు, ఈ రంగు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంది. అంటే ఏ సమయంలోనైనా గ్యాస్ అయిపోతుందని గుర్తించుకోవాలి. దీంతో మనకు సప్లై చేసిన గ్యాస్‌ సిలిండర్‌ నిండుగా వచ్చిందా..? లేదంటే సగం వరకు మాత్రమే ఫిల్‌ చేశారా అనేది తెలుసుకోవచ్చు.
Follow us
Subhash Goud

|

Updated on: Jul 15, 2024 | 12:32 PM

ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. దీని ప్రకారం జులై 27లోగా వంటగ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ సహా కేవైసీ వివరాలను నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చని ప్రకటించారు. దీనికి సంబంధించి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు ఎస్ఎంఎస్ పంపింది. భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పొందారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు.

గ్యాస్ సిలిండర్ రూ.500:

అఖిల భారత ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ అనుసంధానం చేసుకున్న వారికి రూ.372 సబ్సిడీని అందజేస్తున్నారు. అదేవిధంగా ఇతరులకు రూ.47 సబ్సిడీ ఇస్తారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద ఉన్న వారికి రూ.500కే సిలిండర్ అందజేస్తారు. ఉజ్వల పథకంలో లేని వారికి రూ.800కే సిలిండర్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కేవైసీ వివరాలను నమోదు చేయండి

ఈ సందర్భంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినియోగదారులకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎల్‌పీజీ సిలిండర్ హోల్డర్లు 2 వారాల్లో కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలి. దీని ప్రకారం.. భారత్ గ్యాస్, ఇండేన్, IOC సహా ప్రభుత్వ రంగ సంస్థలతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ప్రామాణికతను ధృవీకరించడానికి కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా కేసు ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నంబర్, వేలిముద్ర నమోదు చేయాలని ఆదేశించారు. అలా నమోదు చేసుకోకుంటే వంటగ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి:  Mukesh Ambani: కోడలు రాధికకు వీడ్కోలు.. ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్‌

జూలై 27 చివరి తేదీ:

ఏజెన్సీలకు రాలేని సీనియర్‌ సిటిజన్‌లకు సహాయంగా డెలివరీ వర్కర్‌లు వారి ఇళ్లకు వెళ్లి మొబైల్‌ ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ను తీసుకుంటున్నారు. కాగా, ఉండగా, మే 30లోగా ఆధార్, వేలిముద్ర నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు జూలై 27 వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌కు కేవైసీ చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. కొందరేమో గడువు ఉందని, గడువులోగా కేవైసీ చేసుకోకుండా కనెక్షన్‌ రద్దు అవుతుందని చెబుతున్నారు. అయితే  గడువు ఉన్నా.. లేకున్నా..  గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కేవైసీ చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి