Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!

మగవారికి బ్యాచిలర్‌ లైఫ్‌ కంటే పెళ్లి అయిన తర్వాత కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాచిలర్‌ లైఫ్‌లో ఎన్నో రకాల ఎంజాయ్‌మెంట్‌ ఉంటుంది. ఫోన్‌లు మాట్లాడటం, స్నేహితులతో గడపడం, పార్టీలు చేసుకోవడం, బయటకు తిరగడం అబ్బో ఎన్నో ఉంటాయి. కానీ పెళ్లాయిన తర్వాత ఇవేమి ఉండవు. ఎక్కువ సేపు భార్యతోనే గడిపేస్తుంటారు. ఉద్యోగడం చేయడం, సమయానికి ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఇక గత..

Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!
Relationship Tips
Follow us

|

Updated on: Jul 15, 2024 | 9:12 AM

మగవారికి బ్యాచిలర్‌ లైఫ్‌ కంటే పెళ్లి అయిన తర్వాత కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాచిలర్‌ లైఫ్‌లో ఎన్నో రకాల ఎంజాయ్‌మెంట్‌ ఉంటుంది. ఫోన్‌లు మాట్లాడటం, స్నేహితులతో గడపడం, పార్టీలు చేసుకోవడం, బయటకు తిరగడం అబ్బో ఎన్నో ఉంటాయి. కానీ పెళ్లాయిన తర్వాత ఇవేమి ఉండవు. ఎక్కువ సేపు భార్యతోనే గడిపేస్తుంటారు. ఉద్యోగడం చేయడం, సమయానికి ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఇక గత లైఫ్‌స్టైల్‌ కంటే పెళ్లి అయిన తర్వాత లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోతుంటుంది. ఇక మరి కొందరికి ఒంటరి బతుకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే జీవితంలో అర్థం చేసుకునే భాగస్వామి రావాలని ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి కోరుకుంటారు. ఇక అలాంటి భాగస్వామే వస్తే ఈ జీవితానికి ఇంతకుమించి ఏం అవసరం లేదనిపిస్తుంది.

ఇక భార్యభర్తలు కలిసి ఉన్న సమయం ఆ మధురానుభూతులు వేరేలా ఉంటాయి. ఈ విషయం పెళ్లైన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక భార్య పుట్టింటికో.. లేకపోతే ఆఫీసుకో వెళ్లినప్పుడు ఇంట్లో భర్త ఒక్కడే ఉంటే.. అతను ఎలా ప్రవరిస్తాడనే విషయం ఎంత మందికి తెలుసు..? అయితే భార్య లేనప్పుడు భర్తలు ఎలాంటి పనులు చేస్తారో ఇటీవల ఓ సర్వే ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం.

పాత స్నేహితులతో మాట్లాడటం..

ఇవి కూడా చదవండి

ఇక చాలా మంది భార్య ఉన్నప్పుడు స్నేహితులతో ఫోన్‌లు మాట్లాడటం చాలా తగ్గిపోతుంటుంది. ఇక భార్య ఇంట్లో లేనప్పుడు పాత స్నేహితులందరూ గుర్తుకొస్తారు. అప్పుడు వారితో ఫోన్‌లో మాట్లాడటంలో మునిగిపోతారట. గంటల తరబడి వారితో మాట్లాడుతూ లైఫ్‌ స్టైల్‌ విషయాలు చర్చించుకుంటారట. అంతేకాదండోయ్‌ భార్య లేనప్పుడు స్నేహితురాళ్లతో కూడా ముచ్చట పెడుతుంటారట. అంతేకాదు..భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు చాలా మంది భర్తలు ఎక్కువ సమయం ఫోన్‌లకే కేటాయిస్తారట. టాబ్లెట్లను, ల్యాప్ టాప్ లను వాడుతుంటారు.

వెబ్‌సిరీస్‌లు చూడటం:

చాలా మంది భార్య ఉన్నప్పుడు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చూసేందుకు సమయం ఉండదు. ఇంట్లో భార్య లేనప్పుడు కొందరు వెబ్‌సిరీస్‌లు, తమకు నచ్చిన సినిమాలను చూడటం, ఇతర వీడియోలు చూడడానికి ఇష్టపడతారట.

భర్తలకు అసలైన ఎంజాయ్‌మెంట్‌ ఇదే:

ఇతక భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు చాలా మంది చేసేది ఇదే. దోస్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటారు. భార్య పుట్టింటికి వెళ్లి రోజే స్నేహితలకు కాల్‌ చేసి ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకుని ఎంజాయ్‌ చేస్తారు. ఇక ఇంట్లో ఆ రోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇలా పార్టీలు చేసుకునేది కేవలం భార్య ఊరికి వెళ్లినప్పుడే మాత్రమే.

బయటి ఫుడ్: 

ఇక భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఆమె చేసిన తిండి మాత్రమే తినాలి. కానీ భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు చాలా మంది వటింటి తిండికి స్వస్తి చెబుతారు. బయటి బిర్యాని ఫుడ్‌ను లగించేస్తారట. కొందరేమో ఇంట్లోనే ఎంచక్క తమకు కావాల్సిన వంటలు చేసుకుని తింటారట. భార్య ఉన్నప్పుడు సమయానికి ఇంటికి వచ్చే భర్తలు.. తాను ఇంట్లో లేనప్పుడు సమయానికి ఇంటికి రాకుండా బయటనే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారట.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి