Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి

Hyderabad Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి

Subhash Goud

|

Updated on: Jul 15, 2024 | 8:27 AM

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌తో పాటు.. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, నిజాంపేట్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్‌పేట్, మెహిదీపట్నంతో పాటు.. సిటీ శివారు ప్రాంతాల్లోనూ రాత్రి భారీ వర్షం పడింది. రోడ్లు నదులను తలపించాయి. మోకాళ్లలోతు నీళ్లలో

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌తో పాటు.. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, నిజాంపేట్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్‌పేట్, మెహిదీపట్నంతో పాటు.. సిటీ శివారు ప్రాంతాల్లోనూ రాత్రి భారీ వర్షం పడింది. రోడ్లు నదులను తలపించాయి. మోకాళ్లలోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రామ్‌నగర్‌లో వర్షబీభత్సంతో.. కాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులో చిక్కుకున్న నలుగురు ప్రయాణికులను.. అద్దాలు పగులగొట్టి కాపాడారు స్థానికులు. ఇటు యూసఫ్‌గూడ మెట్రో స్టేషన్‌ పక్కన గల్లీలో వరద ఉధృతికి ఒక కారు కొట్టుకుపోయింది.

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌తో పాటు.. పలు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. GHMC కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగేహైదరాబాద్ మారేడ్‌పల్లిలో అత్యధికంగా 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఖైరతాబాద్‌లో 7.4 సెం.మీ, ముషీరాబాద్‌లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. షేక్‌పేట్‌లో 6.9 సెం.మీ, శేరిలింగంపల్లిలో 6.8సెం.మీ.. ఉప్పల్‌, సికింద్రాబాద్‌లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయిందన్నారు.