KCR: సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. జూన్ 24న తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్..నేడు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. జూన్ 24న తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్..నేడు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపడంతో పాటు..ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్రప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం-2003కి అది విరుద్ధమని.. దాన్ని రద్దుచేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప.. దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు కేసీఆర్.
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

