పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ… ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని …!
ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు... చూపించని టీవీ లేదు... వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు... బట్ ఏం లాభం... ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.

8 గ్రామాలు…1365 ఎకరాలు.. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందే కనిపించేవి. కానీ ఇవాళ లేవు. ఇప్పుడున్న ఊళ్లు రేపు ఉంటాయో.. లేదో కూడా అనుమానమే. ప్రభుత్వాలు చేస్తున్న అరకొర ప్రయత్నాలు.. అసంపూర్ణ ఆలోచనలు.. ఆ ఊళ్లను.. ఊళ్లోని జనాలను, వారి ఆస్తుల్ని ఇప్పటి వరకు ఏ మాత్రం ఆదుకోలేకపోయాయి. సముద్రపు అలల ధాటికి ఊళ్లు కొట్టుకుపోతుంటే .. ఆ జనం కన్నీళ్లు కూడా అందులో కలిసిపోతున్నాయి. వారి ఘోష… సముద్రపు ఘోషలో కలిసిపోయి… ఇన్నాళ్లూ పాలకులకు వినిపించకుండా పోయింది. ఎస్.. మనం మాట్లాడుకుంటున్న ఊరు ఉప్పాడ. శాశ్వత పరిష్కారం ఎప్పుడు? ఎలా ఉండాలి..? ఎలా ఉంది..? ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు… చూపించని టీవీ లేదు… వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు… బట్ ఏం లాభం… ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. అందమైన చీరలపై అలవోకగా జాంధానీ డిజైన్లు అద్దే చేతులు… ఓ వైపు మనోహరమైన సముద్రపు అలల సవ్వడి… ఎటు చూసినా పచ్చదనం… నిజానికి ఆ ఊరి దృశ్యాలు ప్రకృతి గీసిన చిత్రంలా ఉండాలి. ఒకప్పుడు ఉండేది కూడా. కానీ గడిచిన 6 దశాబ్దాలుగా వారి రాత రోజు రోజుకీ మారిపోతోంది. ఎగసి పడే ప్రతి అల.. తమను, తమ ఇళ్లను, తమ ఊరిని మింగేస్తుంటే… తమ బాధ ప్రభుత్వాల ముందు కంఠ శోషగానే మిగిలిపోతూ ఉంటే.. దిక్కు...