- Telugu News Photo Gallery Cinema photos Kollywood 2024 movies kanguva goat movies may show impact on tollywood
Kollywood: సినిమా చూపించడానికి మేమున్నాం అంటున్న తమిళ తంబీలు
మనల్ని ఎవడ్రా ఆపేదంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతుంటే.. మేమే మిమ్మల్ని ఆపేదంటుంది తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు. ఉన్నట్లుండి అంత ధైర్యం వాళ్లకు ఎక్కడ్నుంచి వచ్చింది.. టాలీవుడ్‌ను బీట్ చేసేంత సత్తా కోలీవుడ్‌కు ఉందా అంటే.. ఉందనే చెప్పాలి. నెక్ట్స్ వచ్చే సినిమాలే వాళ్ల ధైర్యం. అవి క్లిక్ అయితే.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు..? తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు.. కుదిర్తే 1000 కోట్లు కూడా వసూలు చేస్తున్నారు మన హీరోలు.
Updated on: Jul 15, 2024 | 8:28 PM

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు.. కుదిర్తే 1000 కోట్లు కూడా వసూలు చేస్తున్నారు మన హీరోలు. ఒకప్పుడు బాలీవుడ్ చూసిన పీక్స్ కంటే.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా బెటర్ పొజిషన్‌లో ఉంది. అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ చేస్తున్నారిప్పుడు. అంత ధైర్యమేంటి అనుకోవచ్చు.. కానీ వాళ్ల ప్లాన్స్ వాళ్లకున్నాయి.

పాన్ ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే.. ఎందుకంటే కాంతార, కేజియఫ్ మినహాయిస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు సినిమాలే. తమిళం నుంచి విక్రమ్, పొన్నియన్ సెల్వన్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కవుట్ అవ్వలేదు. కేవలం తెలుగు, తమిళంలోనే విజయం సాధించాయే కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటి వరకు సత్తా చూపింది లేదు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈ డేట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.

సూర్య హీరోగా నటించిన కంగువ మీద మామూలు అంచనాలు లేవు. 35కి పైగా భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా. సూర్య బర్త్ డే రోజు రిలీజ్ చేసిన ఫైర్ సాంగ్ ఆకట్టుకుంటోంది.




