- Telugu News Photo Gallery Cinema photos Know About Actress Katrina Kaif Net Worth and Luxury Lifestyle
Katrina Kaif: బాబోయ్.. సినిమాల్లో నటించకపోయిన భారీగా సంపాదిస్తున్న కత్రినా.. మల్లీశ్వరి ఆస్తుల గురించి తెలిస్తే షాకే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Updated on: Jul 15, 2024 | 8:07 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా.. ఇటీవలే మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్లు తీసుకుంటుంది.

అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్‌కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే ఒక్క ప్రకటనకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక ఈవెంట్స్‌లో పెర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా రూ.3.5 కోట్లు తీసుకుంటుంది. కత్రినా కైఫ్‌కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది. 2019 సంవత్సరంలో ప్రారంభించింది. దాని పేరు 'కె బ్యూటీ'.

ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రూ.224 కోట్లు ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రీనా.. ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి సందడి చేసింది.




