- Telugu News Photo Gallery Cinema photos Actress Tabu still playing Glamorous roles in Movies at 50's age, details here Telugu Heroines Photos
Tabu: 50 ఏళ్ళ వయస్సులో కూడా గ్లామర్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్న టబు..
సాధారణంగా హీరోయిన్స్ ఏజ్ 50 ఏళ్లు దాటితే ఇక తల్లి పాత్రలకు అత్త పాత్రలకు షిఫ్ట్ అయిపోయావాల్సిందే. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు ఓ బాలీవుడ్ బ్యూటీ. 52 ఏళ్ల వయసులోనూ గ్లామర్ రోల్స్‌లో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు కుర్ర హీరోయిన్లకు పోటి ఇచ్చే రేంజ్‌లో ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. ఏవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సెకండ్ ఇన్సింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు.
Updated on: Jul 16, 2024 | 5:03 PM

సాధారణంగా హీరోయిన్స్ ఏజ్ 50 ఏళ్లు దాటితే ఇక తల్లి పాత్రలకు అత్త పాత్రలకు షిఫ్ట్ అయిపోయావాల్సిందే. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు ఓ బాలీవుడ్ బ్యూటీ. 52 ఏళ్ల వయసులోనూ గ్లామర్ రోల్స్‌లో రచ్చ చేస్తున్నారు.

అంతేకాదు కుర్ర హీరోయిన్లకు పోటి ఇచ్చే రేంజ్‌లో ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. ఏవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సెకండ్ ఇన్సింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు.

35 ఏళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ, ఇప్పటికీ గ్లామర్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ ఈ బ్యూటీ జోరు మరింత పెరిగిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఓ వైపు మదర్ రోల్స్ చేస్తూనే గ్లామర్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు టబు.

భూల్ బులయ్యా 2 సక్సెస్ తరువాత బాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయ్యారు టబు. దృశ్యం 2, భోలా సినిమాల్లో ఆమె చేసిన పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఎక్కువగా అలాంటి రోల్సే ఆఫర్ చేశారు మేకర్స్.

అయితే ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిన టబు, క్రూ సినిమాతో షాక్ ఇచ్చారు. కరీనా, కృతి సనన్‌తో కలిసి నటించిన క్రూ మూవీకి మంచి రెస్పాన్స్ రావటంతో టబుకి మళ్లీ గ్లామర్ రోల్స్ వస్తున్నాయి.

ప్రజెంట్ అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాందిని బార్ 2కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూవీ సెలక్షన్ విషయంలోనూ చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు టబు.

మిగతా స్టార్స్ ఎవరన్నది పట్టించుకోకపోయినా... తన క్యారెక్టర్ ఏంటి? ఆ సినిమాను దర్శకుడు ఎంత వరకు డీల్ చేయగలడు? అన్న లెక్కల మీద సినిమాకు ఓకే చెబుతున్నారు.





























