- Telugu News Photo Gallery Cinema photos Suresh babu to Arvind Krishna latest movie updates from film industry
Film News: సినిమాలపై సురేష్‌బాబు వ్యాఖ్యలు.. అరవింద్ కృష్ణ వీగన్ లైఫ్‌స్టైల్..
ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు. ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని అన్నారు నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సింగం ఎగైన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా కొత్త సినిమా మొదలైంది. ముంబైలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫెరెన్స్ లో నటుడు అరవింద్ కృష్ణకు వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా అవార్డును అందించారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jul 16, 2024 | 3:54 PM

ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా సినిమాలను రూపొందించాలని సూచించారు. దీని వల్ల సినిమా రంగానికి, థియేటర్లకు మేలు జరిగి అనేక మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని అన్నారు నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ. ఆయన నటించిన తాజా సినిమా రౌతు కా రాజ్ జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఇంత మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు నవాజుద్దీన్.

అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సింగం ఎగైన్. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు. ఈ మూవీలో సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్టుగా వెల్లడించారు. సెట్‌లో ఆయనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా కొత్త సినిమా మొదలైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ మొదలైంది. మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ముంబైలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫెరెన్స్ లో నటుడు అరవింద్ కృష్ణకు వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా అవార్డును అందించారు. గత రెండేళ్లుగా ఆయన వీగరనీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వీగన్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





























