- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor to star in upcoming Nani movie with director Srikanth Odela
Janhvi Kapoor: టాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. మరో తెలుగు సినిమాలో జాన్వీ..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. కానీ అక్కడ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ హాట్ బ్యూటీ.
Updated on: Jul 16, 2024 | 6:18 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. కానీ అక్కడ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ హాట్ బ్యూటీ.

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్ గా ఎంపికైంది. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకుందట. ఆహీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. అవును నాని హీరోగా నటిస్తున్న నయా మూవీలో ఈ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారట. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.





























