- Telugu News Photo Gallery Cinema photos Actress Suchitra Krishnamoorthi reveals she ran away from a party in Berlin, know reason why
పార్టీకి పిలిస్తే వెళ్ళాను.. తీరా చూస్తే ఒక్కరికి కూడా బట్టలు లేవు..! హీరోయిన్ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లో సుచిత్రా కృష్ణమూర్తి ఒకరు. 90వ దశకంలో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుచిత్రా కృష్ణమూర్తి . షారుక్ ఖాన్ తో నటించిన ‘కభీ హాన్ కభీ నా’తో సుచిత్రా కృష్ణమూర్తి పేరు తెచ్చుకున్నారు.
Updated on: Jul 16, 2024 | 6:23 PM

బాలీవుడ్ లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లో సుచిత్రా కృష్ణమూర్తి ఒకరు. 90వ దశకంలో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుచిత్రా కృష్ణమూర్తి . షారుక్ ఖాన్ తో నటించిన ‘కభీ హాన్ కభీ నా’తో సుచిత్రా కృష్ణమూర్తి పేరు తెచ్చుకున్నారు.

తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాను ఓ న్యూడ్ పార్టీకి వెళ్ళాను అంది చెప్పింది సుచిత్రా కృష్ణమూర్తి. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

బర్లింగేమ్‌లో న్యూడ్ పార్టీకి వెళ్లడం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది సుచిత్రా కృష్ణమూర్తి. అనుకోకుండా అక్కడికి వెళ్ళాను అని తెలిపింది సుచిత్రా. అయితే బర్లింగేమ్‌లో జరిగిన పార్టీకి నాకు ఆహ్వానం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను.

తీరా డోర్ తీసి చూసి నేను షాక్ అయ్యాను. నేను ఎప్పుడూ దేశీ అమ్మాయినే. ఆ పార్టీకి వెళ్లాక స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించాలి అని అనిపిస్తుంది. ఓరి దేవుడా…’ అలాగే ఈ న్యూడ్ పార్టీలు ఒకింత మంచిదే అందుతుంది సుచిత్ర.

శరీర సానుకూలతను ప్రోత్సహించడం , శరీరానికి సంబంధించిన ఆందోళనను తొలగించడమే ఈ న్యూడ్ పార్టీ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. నెటిజన్స్ ఈపోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.




