AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే

Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే

Phani CH
|

Updated on: Dec 19, 2025 | 6:28 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత దారుణంగా పెరిగింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, దట్టమైన పొగమంచు, చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌లో పాఠశాల పనివేళలు మారాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, పొగమంచులో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీనికితోడు చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ చేసింది . రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయని వెల్లడించింది. ఉత్తరభారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగిందని , వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లో కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలిగాలుల కారణంగా పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, విద్యా సంస్థల పనివేళలను మారుస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని రకాల విద్యా సంస్థలు మార్చిన సమయాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్త పనివేళలు ఉదయం 9:40 గంటల నుండి సాయంత్రం 4:30 గంటలుగా సూచించారు. ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరియు ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న 3.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఏపీ వాతావరణశాఖ పేర్కొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చలితీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు వీడకపోవడంతో లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఆంధ్రా ఊటీ అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల మంచు మేటలు పేరుకుపోయాయి. గురువారం డుంబ్రిగుడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జి.మాడుగులలో 4.1, హుకుంపేట 6.2, ముంచంగిపుట్టు, పాడేరు 6.9, పెదబయలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని రవాణా శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో లైట్లు ఆన్ లో ఉంచాలని, వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించి 40 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్ళవద్దని తెలిపారు. పొగ మంచులో చిన్న నిర్లక్ష్యం కూడా పెను ప్రమాదానికి దారి తీయొచ్చని అధికారులు డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IBomma Rav: ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

Rithu Chowdary: డిమాన్‌ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!

టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్‌

Published on: Dec 19, 2025 06:28 PM