సంగారెడ్డి జిల్లా జోగిపేటలో డ్వాక్రా మహిళల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా మహిళలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఆరుగురు మహిళలకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.