AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

Phani CH
|

Updated on: Dec 19, 2025 | 5:56 PM

Share

‘అఖండ 2: తాండవం’ అఖండ భారత్ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతున్న వేళ, దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా విడుదల ఆలస్యం, వివాదాలపై భావోద్వేగంగా స్పందించారు. బాలకృష్ణ అండతోనే తాము భయపడలేదని, సినిమా డబ్బు కోసం కాదని, సందేశం కోసమే తీశామన్నారు. అభిమానుల ఇబ్బందులపై విచారం వ్యక్తం చేస్తూ, బాలయ్య ఇచ్చిన అండను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయ్యారు. తన సినిమా వివాదాల నడుమ రిలీజ్ కావడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ టైంలో తాను పడిన బాధను పంచుకున్నారు. అఖండ2 సినిమా డబ్బు కోసం తీసింది కాదని.. ప్రజలకు చేరాలనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా అని చెప్పిన బోయపాటి.. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ ఆలస్యం అవడంపై రియాక్టయ్యారు. ‘నేను మనిషినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల అలాంటి ఒక పరిస్థితి వచ్చిందన్నారు బోయపాటి.అయితే మా ఆలోచన అంతా బాలకృష్ణ అభిమానుల గురించే అన్నారు.రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ ఒక రెండు గంటలకు ముందు టికెట్లు తీసుకుని థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఇలా వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుందని.. అది సహజమని.. ఆ క్షణం తమ ఆలోచనలన్నీ అభిమానుల గురించే అన్నారు బోయపాటి. అయితే అప్పటి పరిస్థితుల గురించి తాము భయపడలేదని.. తమకు బాలకృష్ణ ఉన్నారనే ధైర్యం ఉందన్నారు. ఆయన తమకు ఇచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత బాలయ్య వచ్చి సినిమా విడుదలకి ఏం కావాలో అన్నీ చేశారన్నారు. ఆ తర్వాతే అన్నీ సజావుగా జరిగాయాన్నారు బోయపాటి. అంతేకాదు ముందునుంచి అనుకన్నట్టే సినిమా ఘన విజయం సాధించడం మరింత ఆనందాన్నిచ్చింది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు బోయపాటి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rithu Chowdary: డిమాన్‌ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!

టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్‌

పఠాన్‌ 2లో మన టైగర్‌.. NTRను నమ్ముకున్న షారుఖ్

300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..

Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!