- Telugu News Photo Gallery Cricket photos From Ipl to SMAT Team India Player Shreyas Iyer Won 4 Trophies in 2024 check full details
Team India: టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. ఏడాదిలో 4 ట్రోఫీలు ఎత్తేశాడు.. సెలెక్టర్లకు బిగ్ షాకిచ్చాడుగా
SMAT 2024: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2024లో ముంబై జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించిన ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Updated on: Dec 17, 2024 | 7:20 AM

శ్రేయాస్ అయ్యర్‌కు 2024 మరపురాని ఏడాదిగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది అయ్యర్ మొత్తం 4 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. తన నాయకత్వంలో 2 ట్రోఫీలు కైవసం చేసుకోవడం విశేషం. ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్ సాధించిన ట్రోఫీలను ఓసారి పరిశీలిద్దాం..

రంజీ ట్రోఫీ: శ్రేయాస్ అయ్యర్ 2023-24 రంజీ టోర్నీలో ముంబై తరపున ఆడాడు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై ముంబై జట్టు 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ ఈ టైటిల్‌తో 2024ని ప్రారంభించాడు.

IPL ట్రోఫీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

ఇరానీ కప్: 2024లో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ ఛాంపియన్ ముంబైతో పాటు భారత్‌లోని మిగతా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ డ్రాగా ముగిసినా.. ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 2024 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఒక్క ఏడాదిలోనే 4 ట్రోఫీలు అందుకున్నాడు.





























