AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??

అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??

Raju M P R
| Edited By: |

Updated on: Dec 19, 2025 | 8:20 PM

Share

దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ వ్యవస్థాపకుడు, తిరుమల TTD పాలకమండలి సభ్యుడు బి. రామచంద్ర రాజు (ఎన్టీఆర్ రాజు) మృతిచెందారు. తిరుమల స్థానికులకు ఆయన చేసిన సేవలు అపారమైనవి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రామకృష్ణ, మోహన్ కృష్ణ, చైతన్య కృష్ణ తదితరులు తిరుమల వచ్చి ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

దివంగత ఎన్టీఆర్ కు ఆయన వీరాభిమాని. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘానికి వ్యవస్థాపకులు కూడా. ఆయనే తిరుమలకు చెందిన బి. రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ రాజు. ఎన్టీఆర్ రాజుకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధమే వేరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలకు చెందిన ఎన్టీఆర్ కున్న ప్రాధాన్యత వేరు. తిరుమల స్థానికుడిగా టిటిడి పాలక మండలిలో సభ్యుడిగా అవకాశం దక్కించుకున్న ఎన్టీఆర్ రాజు తిరుమల స్థానికులకు ఎన్నో సేవలు చేశారు. హాకర్ లైసెన్సులు, స్థానికులకు ఉద్యోగాలు, వారి సమస్యల పరిష్కారం పట్లనే కాకుండా తిరుమల అభివృద్ధిలో ఆయన ఎంతో శ్రద్ధ కనబరిచారు. అందుకే తిరుమలలో ఎన్టీఆర్ రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉండగా ఆయన మరణం ఎన్టీఆర్ కుటుంబాన్ని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్ రాజు మరణ వార్త తెలుసుకున్న.. దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చారు. ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని ఓదార్చారు. ఉదయమే తిరుమలకు చేరుకున్న ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, మోహన్ కృష్ణలు నివాళులు అర్పించి అంత్య క్రియల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మనవడు హీరో చైతన్య కృష్ణ దంపతులు, మనవరాలు మోహన్ రూప కూడా నివాళులు అర్పించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యేంతవరకు ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులతోనే గడిపారు. అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపకుడిగా, టిటిడి పాలకమండలి సభ్యుడుగా సేవలు అందించిన ఎన్టీఆర్ రాజు మృతి పట్ల జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి మురళీమోహన్, టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి నివాళులు అర్పించారు. స్థానిక టిడిపి నేతలు, పార్టీ కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే

IBomma Rav: ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్

నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్

Rithu Chowdary: డిమాన్‌ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!

Published on: Dec 19, 2025 07:49 PM