పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ఐటీ రంగంలో లేఆఫ్‌ల కారణంగా 35 ఏళ్ల టెకీ ఉద్యోగం కోల్పోయి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్నప్పటికీ పొదుపు లేకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాడు. గడ్డు పరిస్థితుల్లో జాబ్ మార్కెట్‌లో అవకాశాలు దొరకక, అద్దెలు, EMIలు, స్కూల్ ఫీజుల భారం తలుచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. నెటిజన్లు కఠిన పొదుపు పాటించి, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఐటీ రంగంలో ఉద్యోగులు ప్రస్తుతం లే ఆఫ్స్ ఎదుర్కొంటున్నారు. ఓ టెకీ పెట్టిన పోస్టు నెటిజన్లను కదిలిస్తోంది. 35 ఏళ్ల వయసులో తనకు జాబ్ పోయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న తను ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయానంటూ పోస్టు పెట్టాడు. తన వయసు 35 ఏళ్లనీ ఇటీవలే జాబ్ పోయిందనీ రాసుకొచ్చాడు. అసలు ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని, ఇలా పోస్టు పెట్టాల్సి వస్తుందని తను ఎన్నడూ అనుకోలేదనీ తనను బాగా భయపెడుతోంది ఏంటంటే.. ఇప్పటివరకూ తను డబ్బు పొదుపు చేయలేదనీ తెలిపాడు. తనకు కుటుంబం ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల స్కూలు ఫీజులు చాలా ఎక్కువ. ఇక ఇంటి అద్దె, ఈఎమ్‌ఐలు, అన్నీ నెలతిరిగే సరికల్లా వచ్చి పడుతుంటాయి. కానీ జీతం మాత్రం ఆగిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు . తాను చాలా కాలం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నట్టు తెలిపాడు. జాబ్ స్థిరత్వం ఏదోక రోజు వస్తుందనే భావనలోనే చాలా ఏళ్లు గడిచిపోయాయని అన్నాడు. కానీ అది ఎన్నటికీ సాకారం కాని కలగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పనితీరు మెరుగ్గానే ఉన్నా లేఆఫ్స్‌కు గురయ్యానని, కంపెనీలో ఖర్చుల తగ్గింపు, పునర్‌వ్యవస్థీకరణ కారణంగా జాబ్ కోల్పోవాల్సి వచ్చిందని వివరించాడు. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో కూడా గడ్డు పరిస్థితులు ఉన్నాయని ఎన్ని ఉద్యోగాలకు అప్లయ్ చేసినా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాడు. కుటుంబం ముందు ధైర్యం నటిస్తున్నాననీ రాబోయే రోజుల్ని ఎలా నెట్టుకు రావాలో తలుచుకుంటే కంటి మీదకు కునుకు రావట్లేదనీ తెలిపాడు. అంతా సర్దుకుంటుందన్న మాట తరచూ వినేదే అయినా నాకు నమ్మకం కుదరట్లేదు అన్నాడు.ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందుగా కఠిన పొదుపు నియమాలు పాటించి ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలని సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

