AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌

Phani CH
|

Updated on: Dec 19, 2025 | 2:02 PM

Share

ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనంలో అకాల మరణాలపై షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. 2018-2022 మధ్య జరిగిన 3,800కి పైగా మరణాల్లో, 45 ఏళ్ల లోపు వారిలో సగం మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణించారు. కోవిడ్ కాదని, జీవనశైలి మార్పులు, పొగతాగడం, మద్యం, ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ వంటివే ప్రధాన కారణాలని ఎయిమ్స్ తేల్చింది. మీ గుండె పదిలంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాలని హెచ్చరించింది.

ఇటీవల కాలంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఢిల్లీలోని ఎయిమ్స్ తేల్చేసింది. 2018 నుంచి 2022 మధ్య జరిగిన 3,800కి పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వారిలో 45 ఏళ్ల లోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని కుండా బద్దలుకొట్టింది. ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్న అపోహలన్నీ అబద్ధమని తేల్చింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6శాతం ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో 21.5శాతం, ఇతర కారణాల తో 35.9శాతం మంది చనిపోయారని తేల్చింది. వీరందరి చావుకి కోవిడ్ అసలు కారణమే కాదని రిపోర్ట్ ఇచ్చింది. మారుతున్న లైఫ్‌స్టైల్, సిగరెట్, మద్యం, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ ఇవన్నీ యూత్ ను రిస్క్ ఫ్యాక్టర్ లోకి దించుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2018 నుంచి 2022 మధ్యలో మరణించిన యువతలో 57 శాతం స్మోకింగ్, 52 శాతం ఆల్కహల్ సేవించే వారు ఉన్నట్లు ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయనీ, వ్యాయామం వదిలేశారని.. అందుకే గుండె నిట్టూరుస్తోందంటున్నారు.ఈ అజాగ్రత్తే గుండెపోటును ఆహ్వానిస్తోంది అని నిపుణులు చెబుతున్నారు. AIIMS అధ్యయనం ఒక ఘాటైన హెచ్చరిక.. మీ గుండె బలమైన గోడలా నిలబడాలంటే, మీ జీవనశైలిని మార్చుకోవాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు .ఈ గుండె చప్పుడు ఆగకూడదు. జాగ్రత్త పడండి, ఆరోగ్యంగా ఉండండి. లేకపోతే మృత్యు ఘంటికలు వినిపించడం ఖాయం అని ఎయిమ్స్ రిపోర్ట్ హెచ్చరిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయట కాలుష్యం.. కడుపులో బిడ్డకు ప్రమాదమా..?

అప్పుడు మాయం.. ఇన్నాళ్లకు ప్రత్యక్షం !! నాటి హీరో దీనగాథ

నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..

జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు.. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో

6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..