జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు.. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో
భారీ వర్షంలో తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగును రక్షించిన వీడియో వైరల్‌గా మారింది. బిడ్డ తడవకుండా తన కాళ్ల మధ్య నిలిపి తల్లి ప్రేమను చాటింది. జంతువులలోనూ మానవుల వలె అమితమైన ప్రేమ ఉంటుందని ఈ దృశ్యం నిరూపిస్తుంది. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్న ఈ వీడియో, తల్లి ప్రేమకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది.
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు అంతే ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే.. గుండెలను హత్తుకునేలా ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్లలకు ఏ ప్రమాదం ఎదురైనా వారికి తల్లి రక్షణగా నిలుస్తుంది. ఇందుకు మానవులే కాదు ప్రకృతిలోని పశు పక్ష్యాదులన్నీ ఒకేలా ప్రవర్తిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మైదానంలో జోరుగా వర్షం కురుస్తోంది. అటుగా వెళుతోన్న తల్లి ఏనుగు వాన నుంచి తన బిడ్డను రక్షించింది. ఆ ప్రయత్నం నెటిజన్ల మనసుల్ని దోచేసింది. తల్లి ప్రేమకు ఇదో గొప్ప ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిడ్డలపై ప్రేమ మనుషులకే పరిమితం కాదని; జంతువులలోనూ అంతే ప్రేమ ఉంటుందని అంటున్నారు. వైరల్ వీడియోలో పచ్చని మైదానంలో ఏనుగు వర్షంలో తడిసి ముద్దవుతోంది. అయితే పిల్ల ఏనుగు తడవకుండా తన కాళ్ళ మధ్య ఉంచింది. వీడియో కొన్ని లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మానవుల మాదిరిగానే ఏనుగులు సున్నితమైనవి. కుటుంబం ఆధారంగా సామాజికంగా ఓ గుంపుతో కలిసి జీవిస్తాయి. ఏట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లలను ప్రమాదంలో పడనీయవనీ అవి రక్షణ కవచంగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..

