AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ

Phani CH
|

Updated on: Dec 19, 2025 | 12:38 PM

Share

గద్వాలలో కల్లులో అల్ఫ్రాజోలం డ్రగ్‌ని కలిపి విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో, నంద్యాల జిల్లా నందికొట్కూరులో తయారీ కేంద్రాన్ని అధికారులు కనుగొన్నారు. ఆన్‌లైన్ రసాయనాలతో డ్రగ్ తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, రూ. 6 లక్షల విలువైన అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పదివేల కిలోల డ్రగ్ విక్రయించినట్లు తేలింది. దీనిపై ఎన్‌సిబి లోతైన దర్యాప్తు చేపట్టింది.

తెలంగాణలోని గద్వాలలో కల్లులో అల్ఫ్రాజోలం అనే నిషేధిత మందును కలిపి విక్రయిస్తున్నట్లు.. జనం ఆ కల్లును సేవిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. అక్కడ జరిపిన విచారణలో.. ఈ నిషేధిత డ్రగ్ అల్ఫ్రజూలం.. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఓ ప్రైవేటు దుకాణ సముదాయంపైన ఉన్న షెడ్‌లో తయారవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లిన అధికారులు.. డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు స్థానికంగా మంచి విద్యావంతుడు కాగా, మరొకరిని గుంటూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. సుమారు 6 లక్షల విలువైన రెండు కేజీల నిషేధిత అల్ఫ్రాజోలం డ్రగ్ రెండు కిలోల పౌడర్‌ని, అక్కడ వారు తయారు చేసిన పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులైన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులు ఆన్ లైన్ లో రసాయనాలు తెప్పించుకొని ఈ నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సుమారు పదివేల కిలోల వరకు ఈ డ్రగ్ విక్రయించినట్లు నార్కోటిక్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. వీటితో చాక్లెట్లు సైతం తయారుచేసి పరిచయమైన వారికి అమ్ముతున్నట్టు కూడా తేలింది. కొందరు విద్యార్థులకు సైతం ఈ డ్రగ్స్ తయారీని నేర్పించి ఉండవచ్చని నార్కోటిక్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నిషేధిత డ్రగ్స్ ఎక్కడెక్కడ విక్రయించారు, ఎవరు సేవిస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఈ డ్రగ్ తయారవుతోంది, ఏ ఆన్ లైన్ సంస్థ ఈ రసాయనాలను విక్రయిస్తోంది.. అనేదానిపై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈ నిషేధిత అల్ఫ్రజూలం అనే డ్రగ్ కల్లు తయారీలో పెద్ద ఎత్తున కలుపుతున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయో వాటిపై నిఘా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: వచ్చే రెండు రోజులూ జాగ్రత్త !! వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్‌

న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు

ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా