AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

Phani CH
|

Updated on: Dec 18, 2025 | 5:40 PM

Share

హిమాలయాలపై నందాదేవి అణుముప్పు ఆరోపణల నేపథ్యంలో కైలాస పర్వతం మర్మాలపై చర్చ పెరిగింది. 6,638 మీటర్ల ఎత్తున్న ఈ పవిత్ర శిఖరాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ప్రపంచంలో ఎవరెస్ట్ అధిరోహించినా, కైలాసం ఎందుకు అసాధ్యమనేది మిస్టరీ. బౌద్ధ సన్యాసి మిలరేపా అధిరోహించినట్లు కథలున్నా, ఆధ్యాత్మిక శక్తితోనే సాధ్యమైందని నమ్ముతారు. దీని అధిరోహణ నిషేధం వెనుక కారణాలను విశ్లేషిద్దాం.

హిమాలయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 1965లో నందాదేవి శిఖరంపై అమెరికా వదిలేసిన ఫ్లుటోనియం జనరేటర్‌ కారణంగా అణుముప్పు పొంచి ఉంది అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయాలపై చర్చ మరోసారి వినిపిస్తోంది. ముఖ్యంగా కైలాసం పర్వతం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరం అధిరోహకులను చూశాం గానీ దానికి తక్కువ ఎత్తులో అంటే 6,638 మీటర్లు ఉండే కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ఎందుకు సాహసించరు అనే చర్చ సాగుతోంది. టిబెట్‌లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో మానస సరోవరానికి, రాక్షసతాల్ సరస్సుకు సమీపంలో ఉంటుది కైలాసగిరి. సింధు, సట్లేజ్, బ్రహ్మపుత్రా, కర్నాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయని చెబుతారు. హిందూ మతంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ఈ శిఖరాన్ని బోన్, బౌద్ధ, హిందూ, జైన మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు. నరమానవుడెవరూ దాన్ని అధిరోహించలేరని చెబుతారు. కానీ వెయ్యేండ్ల క్రితమే ఓ బౌద్ధ సన్యాసి కౌలాసగిరిని అధిరోహించినట్లు ప్రచారంలో ఉంది. కైలాసగిరి పవిత్రతకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అధిరోహణను నిషేధించింది. అది కష్టం కూడా… అసాధ్యం… అందుకే ఈ పర్వతం చుట్టూ 52 కి.మీ భక్తులు చేసే ప్రదక్షిణ మాత్రమే అనుమతి ఉంది. పర్వతంపైకి ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు. అంతేకాదు,హెలికాప్టర్లు దారి తప్పిపోవడం లేదా కూలిపోవడం వంటి సంఘటనలు… ఎవరైనా అధిరోహించే ప్రయత్నం చేస్తే వేగంగా వయస్సు మీద పడుతుందనే ప్రచారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఆ శిఖరాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 11వ శతాబ్దానికి చెందిన బౌద్ధ సన్యాసి మిలరేపా బోన్ మత గురువైన నారో బోంచుంగ్‌ను అధిరోహణ పోటీలో ఓడించి శిఖరాన్ని చేరుకున్నాడట. అయితే, దీన్ని చాలా మంది భౌతిక అధిరోహణగా కాకుండా, ఆధ్యాత్మిక లేదా యోగ శక్తితో కూడిన విజయంగా భావిస్తారు. మూడు సంవత్సరాల, మూడు నెలల, మూడు రోజులపాటు అక్కడే తపస్సు చేశాడంటారు. కానీ ఆ పర్వతం మీద తనేం చూశాడో, ఏం అనుభవించాడో ఎవరికీ చెప్పలేదు. పవిత్ర స్థలపు అంతర్గత రహస్యాలు, ఆధ్యాత్మిక శక్తి గురించి బహిరంగంగా మాట్లాడితే దాని పవిత్రతను తగ్గిస్తుందని, శక్తిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మిలరేపా భావించి ఉండవచ్చని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తున్నారు. మానవాళిని రక్షించడానికి ఆయన ఆ వివరాలను దాచిపెట్టాడిని చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా

ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి

నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??