ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..
స్టార్ హీరోల సినిమాల లిరికల్ పాటలు సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్కో పాట 100 మిలియన్ల వ్యూస్ దాటుతూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాటలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మ్యూజికల్ హిట్స్ సినిమాల రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి, బాక్సాఫీస్ విజయానికి దోహదపడుతున్నాయి.
స్టార్ హీరోల సినిమాల నుంచి టీజర్స్, ఫస్ట్ లుక్స్ కాదు.. ఏమొచ్చినా సోషల్ మీడియాలో వైబ్ అయితే కామన్. అందుకే లిరికల్ సాంగ్స్ కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కొక్కటి 100 మిలియన్లకు తగ్గకుండా వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా మరో పాట కూడా అదే క్లబ్బులో చేరిపోయింది. మరి ఒక్క పాటతో రచ్చ చేస్తున్న ఆ సినిమాలేంటి..? చికిరీ చికిరీ అంటూ గత నెల రోజులుగా యూ ట్యూబ్ షేక్ అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్‌ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. దానికితోడు చాలా ఏళ్ళ తర్వాత రెహ్మాన్ ట్యూన్ చేసిన తెలుగు పాట ఇది. తాజాగా ఈ పాట 100 మిలియన్ల క్లబ్బులో చేరిపోయింది.. అన్ని భాషలు కలిపితే 150 మిలియన్లు దాటిపోయింది. పెద్ది టీజర్ విడుదలైనప్పటి కంటే.. చికిరీ సాంగ్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక తనయుడికి పోటీగా తండ్రి కూడా వ్యూస్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు నుంచి విడుదలైన మీసాల పిల్ల పాట ఇప్పటి వరకు 85 మిలియన్ల వ్యూస్ అందుకుంది. నేడో రేపో 100 మిలియన్స్ క్లబ్బులో చేరడం ఖాయం. సంక్రాంతికి వస్తున్నాంకు గోదారి గట్టుపైన సాంగ్ ఎంత హెల్ప్ అయిందో.. మన శంకరవరప్రసాద్ గారుకు మీసాల పిల్ల అంత అడ్వాంటేజ్ అయింది. భీమ్స్, అనిల్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసారు ఈ పాటతో. లిస్ట్‌లో కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా కుమ్మేస్తున్నారు పవర్ స్టార్. దేఖ్‌లేంగే సాలా.. చూసినాంలే చాలా అంటూ ఉస్తాద్ పాట యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్‌కు సరిపోయేలా ఈ పాటను రాయించారు హరీష్ శంకర్.. పైగా ఆయన చాలా రోజుల తర్వాత డాన్స్ చేయడం దీనికి అదనపు ఆకర్షణ. రాజా సాబ్ టైటిల్ సాంగ్ సైతం కుమ్మేస్తుంది. దీనికి మొదట్లో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. మెల్లగా అలవాటు పడిపోయారు ఆడియన్స్. 25 మిలియన్స్ వైపు పరుగు తీస్తుంది ఈ టైటిల్ సాంగ్. మొత్తానికి సింగిల్ సాంగ్ కూడా సినిమాపై హైప్ పెంచేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Demon Pavan: అప్పుడు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు
Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కించున్న భరణి
నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??
Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??
కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

