AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

Phani CH
|

Updated on: Dec 17, 2025 | 6:32 PM

Share

దక్షిణ బ్రెజిల్‌ను తాకిన తీవ్ర తుఫాను కారణంగా గువైబా నగరంలోని హావన్ స్టోర్ వద్ద ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రెప్లికా కూలిపోయింది. 90 కి.మీ/గం వేగంతో వీచిన గాలులకు 2020లో ఏర్పాటు చేసిన 114 అడుగుల విగ్రహం నేలకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ బ్రెజిల్‌ను తీవ్ర తుఫాను ముంచెత్తింది. దీంతో చాలా నగరాల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్థంభాలు నేల కూలాయి. అదేవిధంగా అగానే గువైబా నగరంలో హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 114 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఈ గాలుల ధాటికి కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బలమైన గాలుల వీయడంతో విగ్రహం మొదట కాస్తా వంగినట్టు కనిపించగా.. కాసేపలికే అది పూర్తిగా కూలిపోయింది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. ఇది అసలైన అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాదు, బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా ఉన్న 24 మీటర్ల ఎత్తైన ప్రతిరూపం. దీన్ని 2020లో ఏర్పాటు చేసిన విగ్రహం. దీన్ని 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ బేస్‌పై అమర్చారు. అయితే తుఫాన్ కారంణంగా నగరంలో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు విచాయని దానికి కాణంగానే ఈ విగ్రహం కూలిపోయినట్టు తెలిపారు. విగ్రహం కూలినా బేస్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో దీన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ

BSNL బ్రాడ్‌బాండ్‌ ఫ్లాష్‌ సేల్‌.. బెనిఫిట్స్‌ ఇవే

ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్‌