Viral Video: “అమ్మ బాబోయ్.. ఈ కుక్క మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే! చిన్నారి కంటే ముందే ‘మమ్మీ’ అని పిలిచిందిగా!”
Trending Video: ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక చిన్నారి, పక్కనే ఒక పెంపుడు కుక్క కూర్చుని ఉండటం మనం చూడవచ్చు. ఆ చిన్నారి తల్లి తన బిడ్డకు 'మమ్మీ' (Mamma) అని పిలవడం నేర్పించడానికి ప్రయత్నిస్తోంది. చిన్నారికి ఆశ చూపించడానికి ఆమె చేతిలో ఒక తినుబండారం కూడా ఉంది. అది తినిపిస్తానని ఆశ చూపుతూ 'మమ్మీ' అని పిలవమని అడుగుతోంది.

Trending Video: సోషల్ మీడియా ప్రపంచంలో మూగజీవాలు చేసే అల్లరి, వాటి తెలివితేటలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. తన యజమాని చిన్నారికి మాటలు నేర్పిస్తుంటే, ఆ పాప కంటే ముందే ఈ కుక్క మాట్లాడేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక చిన్నారి, పక్కనే ఒక పెంపుడు కుక్క కూర్చుని ఉండటం మనం చూడవచ్చు. ఆ చిన్నారి తల్లి తన బిడ్డకు ‘మమ్మీ’ (Mamma) అని పిలవడం నేర్పించడానికి ప్రయత్నిస్తోంది. చిన్నారికి ఆశ చూపించడానికి ఆమె చేతిలో ఒక తినుబండారం కూడా ఉంది. అది తినిపిస్తానని ఆశ చూపుతూ ‘మమ్మీ’ అని పిలవమని అడుగుతోంది.
పాప ఇంకా నోరు తెరవకముందే, పక్కనే ఉన్న కుక్క ఆ తినుబండారంపై ఆశతో అత్యంత స్పష్టంగా ‘మమ్మీ.. మమ్మీ..’ అని అరవడం మొదలుపెట్టింది. ఆ కుక్క అరుపులు వింటుంటే అచ్చం ఒక మనిషి ‘మమ్మీ’ అని పిలుస్తున్నట్లే ఉండటం విశేషం.
నెటిజన్ల రియాక్షన్..
View this post on Instagram
ఈ సరదా వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు కోటి 20 లక్షలకు పైగా వ్యూస్, లక్షలాది లైకులు వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు:
“ఈ కుక్క ఆ పాప కంటే చాలా తెలివైంది!” అని ఒకరు కామెంట్ చేయగా..
“పాప కంటే ముందు నాకు ఆ ఫుడ్ పెట్టండి అని ఆ కుక్క అడుగుతోంది” అని మరొకరు సరదాగా రాశారు.
“కుక్కలు ఇంతలా అనుకరించగలవా?” అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా, ఆ చిన్నారి కంటే ముందే ‘మమ్మీ’ అని పిలిచి ఆ పెంపుడు కుక్క అందరి మనసు గెలుచుకుంది. ఈ వీడియోను చూసిన వారెవరైనా సరే నవ్వకుండా ఉండలేరు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
