AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ సీక్రెట్ అస్సలు తెలియదు..

భారతీయ కరెన్సీ నోట్లపై ఉండే ప్రతి గుర్తు వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంటుంది. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సహాయం లేకుండానే నోటు విలువను గుర్తించేందుకు ఆర్‌బీఐ కొన్ని ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేసింది. నోటు అంచున ఉండే ఈ గీతల సంఖ్యను బట్టి అది ఎంత విలువైన నోటో తెలుసుకోవచ్చు.

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ సీక్రెట్ అస్సలు తెలియదు..
Why Are There Lines On Indian Currency Notes
Krishna S
|

Updated on: Mar 12, 2026 | 6:11 PM

Share

మనం ప్రతిరోజూ వందల, వేల రూపాయల నోట్లను లెక్కపెడుతుంటాం. ఆ నోట్లపై ఉండే చిన్న చిన్న గుర్తులను ఎప్పుడైనా గమనించారా? నోటుకు అటు ఇటు చివరన కొన్ని నల్లటి గీతలు ఉంటాయి. నోటు విలువను బట్టి ఈ గీతల సంఖ్య మారుతూ ఉంటుంది. చాలామంది ఇవి ఏదో డిజైన్ అనుకుంటారు. కానీ వీటి వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం దాగి ఉంది. సాంకేతిక భాషలో ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అని పిలుస్తారు. ఈ గీతలు ఎందుకు ఉంటాయి? ఏ నోటుపై ఎన్ని గీతలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరి కోసం ఈ గీతలు?

ఈ గీతలను విజువల్ కోడ్స్ అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించారు. కళ్లు కనిపించని వారు నోటును తాకినప్పుడు, ఆ గీతల సంఖ్య, అమరికను బట్టి అది ఎన్ని రూపాయల నోటో సులభంగా గుర్తించగలరు. ఇవి నోటుపై కొంచెం ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటాయి.

నోటు విలువ – గీతల సంఖ్య

100 రూపాయల నోటు: ఈ నోటుకు రెండు వైపులా నాలుగు గీతలు ఉంటాయి.

200 రూపాయల నోటు: దీనిపై కూడా రెండు వైపులా నాలుగు గీతలు ఉంటాయి. కానీ అదనంగా ఆ గీతల మధ్యలో రెండు చిన్న వృత్తాలు ఉంటాయి.

500 రూపాయల నోటు: ఈ నోటుపై రెండు వైపులా ఐదు గీతలు వికర్ణంగా ఉంటాయి.

2000 రూపాయల నోటు: ఈ నోటుపై రెండు వైపులా ఏడు గీతలు ఉండేవి.

గీతలు మాత్రమే కావు..

కేవలం గీతలే కాకుండా నోటుపై అశోక చక్రం పైన ఉండే వివిధ ఆకారాలు కూడా దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడతాయి.

  • 100 నోటుపై: త్రిభుజం
  • 500 నోటుపై: వృత్తం
  • 2000 నోటుపై: డైమండ్ ఆకారం

ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సహాయం లేకుండానే నగదు లావాదేవీలు చేసుకోగలుగుతున్నారు. నోటు విలువ పెరిగే కొద్దీ ఈ గీతల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సారి మీరు నోటును చేతిలోకి తీసుకున్నప్పుడు, ఒకసారి ఆ గీతలను తడిమి చూడండి.

Follow Us
అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ..
అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ..
ఇది వాట్సాప్‌ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌..
ఇది వాట్సాప్‌ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌..
చాణక్యుడి చెప్పిన ఈ మంత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ
చాణక్యుడి చెప్పిన ఈ మంత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ
హిమాలయాల్లో దొరికే అరుదైన పండ్లు.. వీటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు
హిమాలయాల్లో దొరికే అరుదైన పండ్లు.. వీటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు
టీం సెలెక్షన్ నుంచి టాస్ డెసిషన్ వరకు అన్నీ గంభీర్ నిర్ణయాలే..!
టీం సెలెక్షన్ నుంచి టాస్ డెసిషన్ వరకు అన్నీ గంభీర్ నిర్ణయాలే..!
జబర్దస్త్ యాంకర్‌ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్
జబర్దస్త్ యాంకర్‌ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..