రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెడుతోంది. రబీ సీజన్‌లో యూరియా కొనుగోలుకు క్యూ లైన్ల ఇబ్బందులు తొలగించే లక్ష్యంతో ఈ యాప్ రూపొందించబడింది. దీని ద్వారా రైతులు ఇంటి నుంచే తమకు కావలసిన యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు, సమీపంలోని డీలర్ల వద్ద స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతుల సమయం ఆదా అవుతుంది.
తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. యూరియా బస్తాల కోసం ఇక క్యూ లైన్లలో నిల్చునే తిప్పలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైతుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు, కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నట్టు మంత్రి తెలిపారు. యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్ దగ్గర మాత్రమే కాకుండా, జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల దగ్గర ఉన్న యూరియా స్టాక్ లభ్యతను కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన యూరియాను తమకు అనుకూలమైన డీలర్ దగ్గర నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్‌లో కల్పించనున్నారు. యూరియాను బుక్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడీ అందుతుంది. ఆ బుకింగ్ ఐడీ ఆధారంగానే డీలర్ యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో పంట పేరు, సాగు విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. పాస్‌బుక్ లేని రైతులు ఆధార్ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, కౌలు రైతులకు కూడా యాప్‌లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు. హెల్ప్‌లైన్ నెంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా
ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..
Demon Pavan: అప్పుడు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

