టీ20 వరల్డ్‌కప్-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ టూర్ రామసేతు వద్ద ఘనంగా ప్రారంభమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీని ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహిస్తారు. సాంస్కృతిక వారధి రామసేతు నుండి పారామోటార్ ద్వారా ప్రారంభమైన ఈ ట్రోఫీ, వివిధ దేశాల్లో పర్యటించి, క్రికెట్ అభిమానులను ఏకం చేయనుంది. 20 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ 8 వేదికల్లో జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సందడి ప్రతిష్టాత్మక రామసేతుపైన మొదలైంది. ట్రోఫీ టూర్ రామ సేతు నుంచి ప్రారంభమైంది. రెండు సీట్ల పారామోటార్ ట్రోఫీని గాల్లోకి ఎత్తి, ఈ ప్రయోగాన్ని చారిత్రాత్మకంగా, చిరస్మరణీయంగా మార్చింది. ఈ మెగా టోర్నీకి సంయుక్త ఆతిథ్యమిస్తున్న భారత్, శ్రీలంకలను సాంస్కృతికంగా కలిపే రామసేతు మీదగా మంగళవారం ట్రోఫీ టూర్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య వారధిగా నిలిచే ఈ ప్రదేశంపై ట్రోఫీని ఆవిష్కరించడం ఈ కార్యక్రమానికే ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ 29 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. భారత్‌లో ఐదు, శ్రీలంకలో మూడు కలిపి మొత్తం ఎనిమిది వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు కొలంబో, క్యాండీ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ట్రోఫీ టూర్ భారత్, శ్రీలంకతో పాటు ఆసియాలోని ఖతార్, ఒమన్, నేపాల్, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులకు ట్రోఫీని దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుంది. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలకు కూడా ట్రోఫీని తీసుకెళ్లనున్నారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యమున్న రామసేతుపై ట్రోఫీ టూర్‌ను ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఐసీసీ ఛైర్మన్ జై షా తెలిపారు. ఇది కేవలం ట్రోఫీ ప్రయాణం కాదు, వివిధ సంస్కృతులను, క్రికెట్ సమాజాలను ఏకం చేసే ఒక యాత్ర అని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్
బయట కాలుష్యం.. కడుపులో బిడ్డకు ప్రమాదమా..?
అప్పుడు మాయం.. ఇన్నాళ్లకు ప్రత్యక్షం !! నాటి హీరో దీనగాథ
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు.. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

