AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

Phani CH
|

Updated on: Dec 19, 2025 | 3:16 PM

Share

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌ కాల్పుల ఘటనలో 16 మంది మరణించారు. హనుక్కా వేడుకల సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్, నవీద్ ఈ దారుణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌కు ఉగ్రవాద శిక్షణ ఉందని దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల్లో బోరిస్-సోఫియా దంపతులు, పండ్ల వ్యాపారి అహ్మద్ అల్ అహ్మద్ వంటి వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడారు.

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు బీచ్‌లో ఉన్న సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్, నవీద్ జరిపిన కాల్పులలో 16 మంది చనిపోయారు. మరో 25 మంది గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కారు డాష్‌క్యామ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు తెగించి ఒక దుండగుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. లావెండర్ టీ-షర్ట్ ధరించిన బోరిస్, సాయుధుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, సోఫియా అతనికి తోడుగా నిలిచారు. ఈ పోరాటంలో వారు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు వారు చూపిన ధైర్యం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే పండ్ల వ్యాపారి చేసిన సాహసం అద్భుతం. ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా ఫుట్‌బ్రిడ్జిపై కాల్పులు జరుపుతున్న నిందితుడి తుపాకీని అహ్మద్‌ తన వైపుకి లాక్కున్నాడు. అహ్మద్ కు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. అతను తుపాకీని లాక్కొని, పెను రక్తపాతాన్ని నివారించారని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పండ్ల వ్యాపారిని ప్రశంసించారు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిడ్నీ కాల్పుల ప్రధాన నిందితుడు సాజిద్ హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందినవాడు. 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడ ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న అతను.. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మాత్రమే హైదరాబాద్‌ వచ్చి వెళ్లేవాడు. సాజిద్ కుమారుడు నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. వీరిద్దరూ దాడికి ముందు ఫిలిప్పీన్స్‌లోని దావో నగరానికి వెళ్లి, ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 28 రోజుల పాటు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది. సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌పై, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించి బోండీ బీచ్‌లో తమ కుట్రను అమలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌

బయట కాలుష్యం.. కడుపులో బిడ్డకు ప్రమాదమా..?

అప్పుడు మాయం.. ఇన్నాళ్లకు ప్రత్యక్షం !! నాటి హీరో దీనగాథ