36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కోహ్లీ.. డైట్ సీక్రెట్ ఇదే..!
venkata chari
ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ తన డైట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ, తాను తీసుకునే ఆహారంలో దాదాపు 90 శాతం వరకు ఆవిరితో ఉడికించిన (Steamed) లేదా ఉడకబెట్టిన (Boiled) ఆహారం మాత్రమే ఉంటుందని వెల్లడించాడు.
వేయించిన, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉంటాడు. గ్రేవీ కూరలకు బదులు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పులు (దాల్, రాజ్మా, లోబియా- బొబ్బర్లు) మాత్రమే తీసుకుంటాడు.
సలాడ్స్, కొద్దిగా ఆలివ్ ఆయిల్‌తో (Olive Oil) పాన్-గ్రిల్ చేసిన కూరగాయలను ఎక్కువగా తింటాడు.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి సాధారణ నీటికి బదులుగా బ్లాక్ వాటర్ (Black Water - అధిక pH స్థాయి కలిగిన ఆల్కలీన్ వాటర్) తీసుకుంటాడు.
రోజుకు 3-4 కప్పుల గ్రీన్ టీ తాగుతాడు. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.
కోహ్లీ గత కొంతకాలంగా పూర్తిగా శాకాహారిగా (Plant-based Diet) మారిపోయాడు. అతనికి ఇష్టమైన 'బటర్ చికెన్' వంటి వాటిని కూడా దాదాపు పదేళ్లుగా తినడం మానేశాడు.
ఆహార నియమాలతో పాటు, ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. మంచి నిద్ర సరైన రికవరీకి చాలా అవసరం.
కోహ్లీ తన డైట్‌లో స్థిరత్వం పాటించడం గురించి నొక్కి చెప్పాడు. తనకు ఒకే రకమైన ఆహారాన్ని ఆరు నెలల పాటు రోజుకు మూడు సార్లు తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపాడు. క్రమశిక్షణ అనేది ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది.