స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?

08 August 2025

Prudvi Battula 

స్త్రీ ఎడమ కన్నుపై బల్లి పడితే భాగస్వామి నుంచి ప్రేమ, శుభవార్తకి చిహ్నంగా చెబుతారు. అదే కుడి కన్నుపై మానసిక ఒత్తిడి, చెడు వార్తకి సంకేతం అంటారు.

ఓ మహిళా కుడి చెంపపై పడితే ఆమెకు మగ బిడ్డ పుట్టనున్నట్లు చెబుతున్నారు పండితులు. కాలి పై పడిన ఇదే సూచకంగా నమ్ముతారు.

అలాగే ఓ అమ్మాయి పై పెదవి మీద బల్లి పడటం వివాదాలు, తగాదాలు సూచిన అంటారు. అదే కింది పెదవిఫై కొత్త విషయాలు తెలుసుకోవడంతో మంచి అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు.

ఓ మహిళా కుడి చేతిపై బల్లి పడటం ఆర్థిక లాభాలను సూచిస్తుంది. అదే ఎడమ చేతిపై పడితే మానసిక ఒత్తిడి, ఆందోళనకు దారిస్తుందని నమ్ముతారు.

అదే బల్లి స్త్రీ చేతి వేళ్ళపై పడితే ఆభరణాలు, బహుమతులు అందుకోబోతున్నట్టు సూచిస్తుంది. ఎడమ బుజంపై పడిన ఇది సూచన.

అదే విధంగా బల్లి స్త్రీ కుడి బుజం లేదా ఒడిలో పడితే మాత్రం అది భాగస్వామితో అద్భుతమైన ప్రేమతో కూడిన శారీరక సంబంధన్ని సూచిస్తుంది.

అలాగే తలపై పడితే మరణం సూచకంగా నమ్మినట్లే స్త్రీ వెనుక శరీరంపై ఏ ప్రదేశంలో బల్లి పడినా మరణం సంభవిస్తుందని నమ్ముతారు.

బల్లి స్త్రీ శరీరంపై పడకూడని చోట బల్లి పడితే వెంటనే తల స్నానం చేసి ఆలయంలో దీపం వెలిగించి మహా మృత్యుంజయ మంత్రం పాటించాలి. సాధువులకు దానం చెయ్యాలి.