మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
03 August 2025
Prudvi Battula
మునగ ఆకులలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి.
ఈ ఆకులు శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి లక్షణాలను తగ్గిస్తాయి.
మునగ ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటు నుంచి ఉపశమనం కలిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
పోషకాలు అధికంగా ఉండే ఈ ఆకులు అలసటను తగ్గించడానికి, శారీరక, మానసిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మునగ ఆకులలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
కొన్ని అధ్యయనాలు మునగ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుందని అంటున్నాయి.