కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..

30 July 2025

Prudvi Battula 

కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అకాల బూడిద రంగును నివారిస్తుంది.

కరివేపాకు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. దీంతో మీ ఉదరం ఆరోగ్యంగా ఉంటుంది.

కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కరివేపాకుని మీ రోజువారీ డైట్‎లో యాడ్ చేసుకొంటే.. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం, కరివేపాకులో ఉండే కొన్ని రసాయనాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని వెల్లడైంది.

కరివేపాకు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వృద్ధాప్యం నెమ్మదిస్తుంది.

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.