వర్షంలో వెచ్చని చాయ్, కాఫీ, మసాలా పానీయాలు వంటివి మీ గొంతును ఉపశమనం చేస్తాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పెరుగు, కిమ్చి, సౌర్‌క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వర్షం వేళ ఇవి పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
వర్షాకాలంలో బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు వంటివి తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా లభిస్తాయి.
వర్షంలో తులసి, పిప్పరమెంటు, నిమ్మగడ్డి వంటి వాటితో చేసిన హెర్బల్ టీలు తిగితే మీ గొంతుకు ఉపశమనం కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.