పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!

08 August 2025

Prudvi Battula 

మీ ఇంట్లో నగదు ఉంటే, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో మీరు నిరూపించాల్సి ఉంటుంది. జీతం, వ్యాపారం, ఆస్తి అమ్మకం మొదలైనవి. మూలం చెల్లకపోతే, ఐటీ శాఖ చర్య తీసుకోవచ్చు.

మీరు భారీగా నగదును ఉంచుకుంటే, దానిని ఆదాయపు పన్ను రిటర్న్‌లో చూపించడం అవసరమని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

మీరు ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ దాని కోసం ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు నిల్వ చేస్తుంటే. ఇందుకు సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉండాలి.

నగదు మూలం వెల్లడించకపోతే, ఆదాయపు పన్ను శాఖ దానిని వివరించలేని ఆదాయంగా పరిగణించవచ్చు. అటువంటి సందర్భంలో, సెక్షన్ 69A కింద సర్‌ఛార్జ్, సెస్‌తో పాటు 60% పన్ను విధించవచ్చు.

చాలా మంది వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బులకు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయానికి సైతం బిల్లులు ఉండాలి.

మీరు ఒక రోజులో ఎవరికైనా ₹2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే లేదా ఇస్తే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ఉల్లంఘన అవుతుంది. దీనిపై అదే మొత్తంలో జరిమానా విధించవచ్చు.

వివాహం, బహుమతి లేదా పెద్ద కొనుగోలు వంటి సందర్భాలలో కూడా ₹2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.

మీ దగ్గర భారీగా నగదు ఉంటే, దానికి సంబంధించిన రసీదులు, ఖాతా స్టేట్‌మెంట్‌లు, అమ్మకాలు లేదా జీతం రుజువులు వంటి అన్ని పత్రాలను సురక్షితంగా ఉంచండి. దర్యాప్తు సమయంలో ఈ పత్రాలు మీ రక్షణలో ఉపయోగపడతాయి.

పారదర్శకతను కాపాడుకోవడానికి ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై దృష్టి పెడుతుంది. అధిక నగదు లావాదేవీలు అనుమానాన్ని రేకెత్తిస్తాయి, కాబట్టి నగదు వినియోగాన్ని పరిమితం చేయడం తెలివైన పని.