- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine has been waiting for hits for 20 years, She is Bollywood Actress Chitrangada
20ఏళ్లుగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరెన్ లెగ్ అని ట్యాగ్ వేసేస్తారు.
Updated on: Dec 19, 2025 | 8:43 PM

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరెన్ లెగ్ అని ట్యాగ్ వేసేస్తారు. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

క్రమంగా ఇండస్ట్రీలో కనిపించకుండాపోతారు.. కానీ ఈ హీరోయిన్ రూటే సపరేట్. 20ఏళ్లుగా ఒక్క హిట్ అందుకోలేకపోయింది.. ఇరవై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇరవై ఏళ్లుగా హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అందంలో అప్సరస.. గ్లామర్ డోస్ కూడా ఎక్కువే.. కానీ అదృష్టం మాత్రం దక్కలేదు ఈ చిన్నదానికి.. ఇంతకూ ఆమె ఎవరంటే..

బాలీవుడ్ ముద్దుగుమ్మ చిత్రాంగదా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005లో హజారోన్ ఖ్వైషీన్ ఐసీ అనే క్రైమ్ డ్రామాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు నిర్మాతగానూ చేసింది. 2018లో సూర్మా అనే స్పోర్ట్స్ డ్రామాకు నిర్మాతగా వ్యవహరించింది. ఇటీవలే హౌస్‌ఫుల్ 5 సినిమాలోనూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

సినీ కెరీర్ లో చిత్రాంగదా సింగ్ తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకుంది. అలాగే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ లో నేను ఎన్నో తప్పులు చేశాను.

నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నా.. గ్యాంగ్‌స్టర్ సినిమా నేను రిజెక్ట్ చేశా.. అంతే కాదు తను వెడ్స్ మను సినిమాను కూడా నేను మిస్ చేసుకున్నా.. మంగల్ పాండే’లో అమీషా పటేల్ చేసిన పాత్రను కూడా నేను రిజెక్ట్ చేశా.. అని తెలిపింది.




