21 December 2024
Subhash
రైలులో ఎక్కువ దూరం ప్రయాణించే వారంతా సుఖవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఇక రైలులో ప్రయాణించడానికి టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిందే.
దాదాపు ప్రయాణానికి 60 రోజుల ముందే టికెట్ల బుక్ చేసుకునేందుకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తుంది. అత్యవసర సమయాల్లో ప్రయాణించాలనుకునే కోసం సైతం తాత్కాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతుంది.
చాలామంది ప్రయాణికులకు బెర్తులు కన్ఫర్మ్ కావడంలో లేదు. దాంతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, రైలు ప్రయాణానికి ముందు చార్ట్ సిద్ధమయ్యే విషయం అందరికీ తెలిసిందే.
చార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా రైలులో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కానీ, ఈ విషయం చాలామందికి తెలియదు.
భారతీయ రైల్వే దేశంలోని అనేక స్టేషన్లలో కరెంట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా కౌంటర్లలో ప్రయాణికులు రైలు బయలుదేరే కొద్దిసేపటి ముందు రైలులో మిగిలిపోయిన బెర్తులను బుక్ చేసుకోవచ్చు.
చాలాసార్లు రైలులో చార్ట్ సిద్ధమయ్యాక సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. ఈ క్రమలో ఖాళీ సీట్లను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ కరెంట్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది.
రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు చార్ట్ తయారవుతుంది. చార్ట్ రెడీ అయ్యాక రైలు బయలుదేరే ఐదు, పదినిమిషాల ముందు సైతం కరెంట్ టికెట్ బుకింగ్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చు.
చార్ట్ తయారు చేసిన తర్వాత, రైలులో సీట్లు ఖాళీగా ఉంటే.. ప్రయాణికులకు కరెంటు బుకింగ్ విధానంలో టికెట్ జారీ చేస్తారు. అయితే, బెర్తులు ఖాళీగా ఉంటే మాత్రమే బెర్తులు కన్ఫర్మ్ అవుతాయి.