AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 72 మంది ప్రయాణికులు

కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పక్షుల గుంపును ఢీకొన్న విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అజర్‌బైజన్‌ రాజధాని బాకు నుంచి రష్యా వెళ్తున్న అజర్‌బైజన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 72 మంది ప్రయాణికులు
Flight Crashes
Balaraju Goud
|

Updated on: Dec 25, 2024 | 1:37 PM

Share

కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరగింది. అజర్‌బైజాన్‌ నుంచి రష్యా వెళ్తున్న ఓ విమానం కుప్పకూలింది. విమానంలో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని చెచ్న్యా రాజధాని గ్రోజ్నీకి విమానం వెళుతోంది. పక్షుల గుంపును ఢీకొనడంతో విమానం దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో రన్‌వేపై ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గురైన విమానం అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా అధికారులు ప్రకటించారు. కూలిపోయిన విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని కజకిస్థాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని కజకిస్థాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. విమానాన్ని, పక్షుల గుంపును ఢీకొనడమే ప్రమాదానికి కారణమని విమానయాన సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో విమానం నేలపై కూలిపోయి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంపై అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

వీడియో చూడండి..

రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందు గాల్లోనే పలుమార్లు చక్కలు కొట్టింది. ఈ క్రమంలోనే పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టాక.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి ప్రయత్నించిన టైమ్‌లో ప్రమాదం జరిగింది. రన్‌వేను తాకుతుండగానే ఫ్లైట్‌ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని అంర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..