వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు..

వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు..

Phani CH

|

Updated on: Dec 25, 2024 | 2:03 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నంబర్ వన్ టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే ఈ సెలబ్రిటీ టాక్ షో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక ఏడో ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ గెస్టుగా విచ్చేశారు.

తాజాగా ఈ ఎపిసోడ్‌ షూటింగ్ కూడా ఫినిష్‌ అయిపోయింది. దీంతో ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ గ్లింప్స్‌ షేర్ చేసి ఆహా.. ఈ గ్లింప్స్‌తో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. బాలయ్య , వెంకీ ఫ్యానస్‌ను ఖుషీ అయ్యేలా చేసింది. ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వెంకీ రావడం ఇదే మొదటిసారి. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం అంటే డిసెంబర్ 22 ప్రారంభమైంది. వెంకటేష్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా బాలయ్య షోకు వచ్చారు. తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడకు వచ్చి సందడి చేశారు వెంకటేష్. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయడంతో స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !!

అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..

సంధ్య థియేటర్‌ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి

దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!