22 December 2024
Subhash
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం మరింతగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేశాయి.
తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502 పేరిట రెండు వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
3501 అనేది ప్రీమియం మోడల్. దీని ధర రూ.1.27 లక్షలు (ఎక్స్‌షోరూమ్, బెంగళూరు) కాగా.. 3502 మోడల్ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.
ఇదే సిరీస్‌లో 3503 మోడల్‌ను త్వరలో తీసుకురానున్నారు. అయితే ఐఫోన్ ఉన్న ధరల్లో ఈ స్కూటర్ ధరలు ఉన్నాయి.
పాత చేతక్ ఎలక్ట్రిక్ మాదిరిగానే అదే క్లాసిక్ లుక్‌తో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది బజాజ్. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను అమర్చింది కంపెనీ.
ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో దూసుకెళ్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చని తెలిపింది. ఇందులో 5 అంగుళాల టచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించింది కంపెనీ.
ఇందులో మ్యాప్స్‌తో పాటు కాల్ ఆన్సర్/ రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. జియో ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్‌స్పీడ్ అలర్ట్ ఫీచర్లు.