Multibagger Stock: లక్షను ఏడాదిలో రూ.8 లక్షలు చేసిన టాటా గ్రూప్ స్టాక్..

టాటా గ్రూప్ అనేది కేవలం ట్రస్ట్ పేరు మాత్రమే కాదు.. దాని కంపెనీలు తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇవ్వడానికి కూడా ప్రసిద్ది చెందాయి. గత 3 సంవత్సరాలలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లను రూ. 8 లక్షలు అందించిన ఓ కంపెనీ టాటా గ్రూప్‌లోనే ఉంది.

Multibagger Stock: లక్షను ఏడాదిలో రూ.8 లక్షలు చేసిన టాటా గ్రూప్ స్టాక్..
stock market
Follow us
Venkata Chari

|

Updated on: Apr 22, 2022 | 4:20 PM

టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎల్క్సీ షేర్లు గత 3 ఏళ్లలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను అందించాయి. కంపెనీ షేరు ధర (Tata Elxsi షేర్ ప్రైస్) అప్పుడు రూ. 1,000 కంటే తక్కువగా ఉండేది. కాగా, ప్రస్తుతం అంటే శుక్రవారం దాని ధర రూ. 8,000 పైకి చేరింది. టాటా Elxsi స్టాక్ కేవలం ఒక సంవత్సరంలో BSEలో 168% పెరిగింది. గత సంవత్సరం, 22 ఏప్రిల్ 2021న దీని ధర రూ. 3,046గా ఉంది. ఈ రోజు శుక్రవారం దాదాపు రూ.8,200 వద్ద ట్రేడవుతోంది. గత 3 ఏళ్లలో కంపెనీ షేరు 725% లాభపడింది. ఇది 18 ఏప్రిల్ 2019న రూ. 956గా ఉంది. నిన్న అంటే గురువారం రూ. 7,889 వద్ద ముగిసింది. అదే సమయంలో, దాని 52 వారాల గరిష్ట స్థాయికి అంటే ఈ స్టాక్ 9,420 రూపాయలకు చేరుకుంది.

రూ. 1 లక్ష రూ. 8 లక్షలుగా మార్చింది..

ఈ విధంగా, ఒక వ్యక్తి 3 సంవత్సరాల క్రితం కంపెనీ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, ప్రస్తుతం అది రూ. 8 లక్షలకు పైగా మారేవి. కాగా, ఈ కాలంలో సెన్సెక్స్‌లో కేవలం 47% లాభం మాత్రమే కనిపించింది.

Tata Elxsi Shares2Trades సహ వ్యవస్థాపకుడు ఎపై షేర్లు రూ. 9,200లకు చేరుకుంటుంది. గత 3 సెషన్లలో కూడా టాటా ఎల్క్సీ స్టాక్ మంచి లాభాలను ఆర్జించిందని రామచంద్రన్ తెలిపారు. ఇది స్థిరంగా రూ. 8,180 స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అది రూ. 9,200 టార్గెట్ ధరకు చేరుకుంటుందని తెలిపారు.

డిజైనింగ్ రంగంలో ప్రధానమైన టాటా ఎల్క్సీ డిజైన్, టెక్నాలజీ సేవలలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రసార, కమ్యూనికేషన్, ఆటోమోటివ్ వంటి పరిశ్రమలకు పరిష్కారాలు, ఉత్పత్తి ఇంజనీరింగ్‌కు సంబంధించిన సాంకేతిక సేవలను కంపెనీ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Also Read: Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!

Bank OD: పర్సనల్ లోన్ కంటే.. ఓవర్‌డ్రాఫ్ట్ ఉపయోగరమా..? ఎందుకంటే..